Gadhimai Festival 2024: నేపాల్‌లో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే గాధిమై ఉత్సవంలో గాధిమై దేవతను శాంతింపజేయడానికి సామూహిక జంతు బలులు ఉంటాయి. వివాదాస్పద ఆచారంలో వేల సంఖ్యలో గేదెలు, మేకలు, ఇతర జంతువులను వధిస్తారు. అత్యంత ఘోరమైన చర్య బారా జిల్లాలో గాధిమై దేవి జాతరలో జరుగుతుంది. ఈ జాతరలో 2.5లక్షల నుంచి 5లక్షల వరకు మూగజీవాలను బలిస్తుంటారు. అయితే ఈ సారి భారత సశాస్త్ర సీమ బల్, స్థానిక యంత్రాంగం మూగజీవాలను రక్షించేందుకు చర్యలు తీసుకుంటుంది. అయితే ముందుగా ఈ రక్తపాత సంప్రాదాయం గురించి తెలుసుకుందాం.
Grorgia: జార్జియాలోని ఇండియన్ రెస్టారెంట్లో దారుణం జరిగింది. రోజంతా పనులు చేసి అలసిపోయి వచ్చి పడుకున్న తర్వాత అక్కడి సిబ్బంది నిద్రలోనే మరణించారు. మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 11 మంది విదేశీ పౌరులు ఉండగా..ఒకరు మాత్రమే జార్జియా పౌరుడు ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ప్రశాంతంగా నిద్రిస్తున్న సమయంలో వీరు మరణించడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం.
Zakir Hussain Passed Away At 73: భారత సంగీతానికి ఎనలేని సేవలు అందించిన విశ్వవిఖ్యాత తబాలా విధ్వాంసుడు జాకీర్ హుస్సేన్ పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
Woman murderer Pregnant in Prison: అమెరికాలోని ఒక జైలులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక లేడీ ఖైదీ జైలులో.. ప్రెగ్నెంట్ అవ్వడమే కాకుండా.. పండంటి మగ బిడ్డకు జన్మనించిందంట. ఇది తెలిసి అక్కడి అధికారులు మాత్రం జుట్టు పీక్కుంటున్నారంట.
Syria Trouble: అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ అధికారం నుండి వైదొలగిన తర్వాత సిరియాలో కష్టాలు పెరుగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ తర్వాత ఇప్పుడు టర్కీ కూడా సిరియాపై దాడులు చేసింది. ఉగ్రవాదానికి అడ్డాగా మారేందుకు సిరియాను అనుమతించబోమని టర్కీ ప్రకటించింది.
Syria: సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ దేశం విడిచి రష్యాకు పారిపోయాడు. తన వద్ద ఉన్న కిలోల కొద్దీ బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు చెబుతున్నారు. అస్సాద్ దేశం విడిచిపారిపోతున్న సమయంలో అతను కిలోల కొద్దీ బంగారం, లగ్జరీ కార్లు, పెద్దమొత్తంలో డాలర్లు, యూరోలు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ భారతీయుకు తీపి కబురు చెప్పారు. తాను అధ్యక్ష పదవిని చేపట్టగానే..అక్రమ వలదారులు అందర్నీ అమెరికా నుంచి వెళ్లగొట్టి, చట్టబద్ధంగా వలస వచ్చేవారికి మార్గం సులువు చేస్తానంటూ ట్రంప్ పేర్కొన్నారు.
syrian rebels looted president house: సిరియాలో కొనసాగుతున్న అంతర్యుద్ధం నేపథ్యంలో అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ దేశం విడిచి పారిపోయారు. అనంతరం తిరుగుబాటుదారులు ఆదివారం రాజధాని డమాస్కస్‌ను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రపతి పారిపోయిన వెంటనే రాష్ట్రపతి భవన్‌లోకి ప్రవేశించిన జనం అక్కడ ఉన్న వస్తువులను దోచుకున్నారు.
Syria Civil War: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో అంతర్యుద్ధంతో సతమతమవుతోంది. దీని వెనక అమెరికాలోని డీప్ స్టేట్ హస్తం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. వివిధ దేశాల్లో తమ మాట వినని ప్రభుత్వాలు క్రమంగా కూలుస్తూ వస్తోంది అమెరికా. ఈ నేపథ్యంలో సిరియాలో అసద్ ను పదవీచ్యుతుడిని చేయడంలో అమెరికా తెర వెనక పావులు కదిపిందనే వార్తలు వస్తున్నాయి.
Hindu society protest: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం వాల్ మార్ట్ పట్ల హిందు సంఘాలు తీవ్రంగా ఫైర్ అయినట్లు తెలుస్తొంది. హిందు దేవతల బొమ్మలను చెప్పులు, బికీనీలు, చెడ్డీలపై ముద్రించి ఆన్ లైన్ లో అమ్మకాలకు పెట్టినట్లు తెలుస్తొంది.
US Earthquake: ప్రకృతి సమతుల్యం దెబ్బ తినడం వంటి కారణాలతో భూ పొరల్లో ఏర్పడిన ఒడిదుడుకుల కారణంగా భూకంపాలు సంభవిస్తుంటాయి. రీసెంట్ గా తెలంగాణలో ములుగు జిల్లాలో వచ్చిన భూకంపంతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కి పడ్డాయి. తాజాగా అమెరికాలోని పలు రాష్ట్రాల్లో భారీ భూకంపం సంభవించింది.
Bangladesh: జూలై, ఆగస్టు నెలల్లో బంగ్లాదేశ్‌లో జరిగిన విద్యార్థి ఉద్యమం ఆ దేశ ప్రభుత్వాన్ని కూలదోసింది. ఈ క్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లోని జైళ్లపై దాడులు చేశారు. జైళ్లుపై దాడి చేసి నిప్పంటించడంతో నేరస్తులకు సంబంధించిన పత్రాలన్నీ దగ్ధమయ్యాయి. జైళ్లపై దాడుల సమయంలో వేలాది మంది ఖైదీలు తప్పించుకున్నారు. వీరిలో 700 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Alia Fakhri: బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ సోదరి ఆలియాను న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన యూఎస్ లో సంచలనంగా మారిందని చెప్పుకొవచ్చు. దీనిపై ఇప్పటి వరకు కూడా నటి రియాక్ట్ కాలేదని తెలుస్తొంది.
Donald Trump warning: హమాస్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారిని తాను పదవీ బాధ్యతలు చేపట్టలేపు విడిచిపెట్టాలని హెచ్చరించారు. లేదంటే తనలో ఉన్న రాక్షసత్వాన్ని చూపించాల్సి వస్తుందని హమాస్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
Clashes At football match: ఫుట్ బాల్ మ్యాచ్ నేపథ్యంలో అభిమానుల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. దీంతో దాదాపు.. 100 మందికిపైగా అభిమానులు చనిపొయినట్లు తెలుస్తొంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి.
Bangladesh: బంగ్లాదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. ప్రముఖ హిందూ మహిళా జర్నలిస్టుపై దాడి జరిగింది. అక్కడి మతోన్మాదుల మూక మహిళా జర్నలిస్టుపై దాడికి ప్రయత్నించింది. ప్రముఖ టీవీ జర్నలిస్ట్ మున్సీ సాహా మీడియా కార్యాలయం నుంచి వస్తున్న సమయంలో..ఈ ఘటన చోటుచేసుకుంది. ఢాకాలోని కార్వాన్ బజార్ ప్రాంతాల్లో ఈ దాడి జరిగింది.
Russia Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. డొనాల్డ్ ట్రంప్ తాను అధికారంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే ఈ యుద్దానికి ముగింపు పలుకుతానని శపథం చేసాడు. కానీ ఆయన పదవి చేపట్టేలోపే.. జో బైడెన్ ప్రభుత్వం.. ఉక్రెయిన్ ను రష్యాను రెచ్చగొట్టేలా వ్యూహాలను రచిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా పై మిస్సైల్స్ దాడులు చేయడానికి అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రష్యా కూడా అదును చూసి ఉక్రెయిన్ విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది.
Israel Hezbollah War: నిన్న మొన్నటి వరకు నిత్యం బాంబుల దాడులు, కాల్పుల మోతలు, రాకెట్ల వర్షంతో అట్టుడికిన లెబనాన్ లో శాంతి నెలకుంటుంది. అమెరికా మధ్యవర్తిత్తంతో హెజ్ బొల్లా...ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీంతో ఇజ్రాయెల్ దాడులను ఆపేసింది.
Pawan Kalyan: బంగ్లాదేశ్ లో మరో ఘోరం చోటు చేసుకుంది. ఇస్కాన్ కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును బంగ్లా ప్రభుత్వం అరెస్ట్ చేయడం అంతర్జాతీయం గా కాక రేపుతోంది. అక్టోబర్ 25న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఓ ర్యాలీ పాల్గొన్న కృష్ణదాస్.. బంగ్లాదేశ్ జాతీయ జెండాను అగౌరవ పరిచినట్టు అక్కడి ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్ ను ఇప్పటికే భారత ప్రభుత్వం ఖండించగా.. తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ చిన్నయ కృష్ణదాస్ అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
Donald Trump Vows: అమెరికా అధ్యక్ష్య ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా పలు దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువుల సుంకాలపై ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మెక్సికో, కెనడా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 25శాతం సుంకం విధించనున్నట్లు ట్రంప్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ట్రంప్ ఈ ప్రకటన చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.