PM Narendra Modi: ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ చేరుకున్న ప్రధాని మోడీ.. రేపు ట్రంప్ తో భేటి..

PM Narendra Modi: ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన జోష్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరింత ఉత్సాహాంగా ఉన్నారు. ఇప్పటికే ఖరారైన ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ముందుగా ఫ్రాన్స్ చేరుకున్నారు ప్రధాని మోడీ. అక్కడ AI సమ్మిట్ లో పాల్గొన్న తర్వాత అమెరికా వెళ్లనున్నారు. అక్కడ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటి కానున్నారు. రెండోసారి ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాకా వీరిద్దరి మధ్య జరగనున్న భేటిపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 11, 2025, 08:28 AM IST
PM Narendra Modi: ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ చేరుకున్న ప్రధాని మోడీ.. రేపు ట్రంప్ తో భేటి..

PM Narendra Modi:ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీకి  ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌కు చేరుకున్నారు. అక్కడ ప్రధానికి ఘన స్వాగతం లభించింది.  ఫ్రాన్స్‌  రక్షణ మంత్రి సెబ్‌ లెకొర్నూ  ప్యారిస్‌ ఎయిర్‌పోర్టులో ప్రధాని మోడీకి సాదర స్వాగతం పలికారు. ఇక దారి పొడవునా,  మోడీ బస చేసే హోటల్‌ వద్ద భారతీయులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. వారికి ప్రధాని మోదీ అభివాదం చేశారు. సాయంత్రం మోదీకి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా పలు దిగ్గజ టెక్‌ కంపెనీల సీఈఓలు కూడా విందులో పాల్గొన్నారు.

ఫ్రాన్స్‌ పర్యటనలో వున్న ప్రధాని మోదీ  పారిస్‌లో జరుగుతున్న ఏఐ కార్యాచరణ శిఖరాగ్ర సదస్సులో ఇవాళ పాల్గొంటారు.  ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌తో కలిసి సదస్సును ఉద్దేశించి  ప్రసంగిస్తారు. అనంతరం బుధవారం చారిత్రక నగరం మార్సెయిల్‌లో భారత్‌ తొలి కాన్సులేట్‌ను మాక్రాన్‌తో కలిసి ప్రారంభిస్తారు. కడారచ్‌లో ఫ్రాన్స్, భారత్, పలు ఇతర దేశాలు నిర్మిస్తున్న అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ రియాక్టర్‌ను  ప్రధాని మోదీ  సందర్శిస్తారు.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

ఫ్రాన్స్‌ గడ్డపై మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో ప్రాణాలర్పించిన భారత సైనికులకు కు మజారŠగ్స్‌ వార్‌ సిమెట్రీ వద్ద నేతలిద్దరూ నివాళులర్పిస్తారు. అనంతరం నరేంద్ర మోడీ అమెరికా బయల్దేరి వెళ్తారు. ప్రధానిగా ఫ్రాన్స్‌లో మోడీకి ఇది ఆరో అధికారిక పర్యటన. లాస్ట్ ఇయర్ భారత్‌–ఫ్రాన్స్‌ తమ వ్యూహాత్మక భాగస్వామ్యానికి పాతికేళ్ల వేడుక జరుపుకున్నాయి. ఇరు దేశాల భాగస్వామ్యం ఇన్నొవేషన్లు, టెక్నాలజీ, మారిటైం, రక్షణ సహకారం, ఉగ్రవాదంపై పోరు, ఆరోగ్యం, సంప్రదాయేతర ఇంధన వనరులతో పాటు పలు రంగాలకు విస్తరించిందని విదేశాంగ శాఖ ఈ సందర్భంగా ఒక ప్రకటనలో పేర్కొంది. మాక్రాన్‌ ఆహ్వానాం మేరకు మోదీ ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్నారు. రేపు నరేంద్ర మోడీ అమెరికా వెళ్లనున్నారు. అక్కడ ట్రంప్ తో పలు ద్వైపాక్షిక అంశాలతో పాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను తిరిగి పంపించడం వంటి వాటిపై ఆయన మాట్లాడనున్నారు.

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News