Narendra Modi Paris: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐ విషయంలో ప్రపంచం అంతా కలిసి ముందుకు వెళ్లాలని అన్నారు. ఏఐ వల్ల అన్ని పనుల్లో మార్పులు వచ్చే మాట నిజమే కానీ.. దానితో ఉద్యోగాలు పోతాయనేది వదంతి మాత్రమే అని కొట్టి పడేశారు. ఉద్యోగాల్లో ఎప్పటికప్పుడు స్కిల్స్ పెంచుకుంటూ ముందుకు వెళితే వారికి అందరికంటే ఉన్నత అవకాశాలు వస్తాయన్నారు.
డిజిటల్ మార్కెటింగ్, బిజినెస్ లో భారత్ దూసుకుపోతుందని మోడీ తెలిపారు. దేశాన్ని ఏలడం అంటే విపక్షాలను ఎదుర్కోవడం ఒకటే కాదని, అన్ని రకాల ఆవిష్కరణలు ఎప్పటికప్పుడూ ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్లాలన్నారు. ఏఐతో వచ్చే అద్భుత ఆవిష్కరణలు మీద మాత్రమే కాకుండా.. దీనితో వచ్చే ప్రమాదాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
సాంకేతికతను సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకు రావాలని..పలు దేశాల అధినేతలకు, టెక్ రంగ నిపుణులకు పిలిపునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థలను సమూలంగా మార్చేస్తుందన్నారు. ఈ శతాబ్దానికి మానవాళికి గొప్ప ఆవిష్కరణ అన్నారు. కాగా ఏఐలో భారత్ టెక్నాలజీని ప్రపంచ దేశాలతో పంచుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మంతరి మోడీ.. పారిస్ లో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశానికి సహ అధ్యక్షునిగా వ్యవహరించారు. ఈ సమావేశం తర్వాత ప్రధాన మంత్రి అమెరికా పర్యటనకు వెళ్లారు.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.