Telangana Secretariat: సచివాలయ నిర్మాణంపై విజిలెన్స్ విచారణకు తెలంగాణలోని కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదేశించింది. సచివాలయానికి వెచ్చించిన నిధులు, నిర్మాణం, నాణ్యత, ఐటీ పరికరాల కొనుగోలు అంశాలను తేల్చాలని విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. సర్కారు ఆదేశాలతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం వింగ్‌ల వారిగా విచారణ మొదలుపెట్టింది.
ఈ విచారణలో సచివాలయం నిర్మాణంలో భారీ అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐటీ విభాగంపై విజిలెన్స్ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఆ నివేదికలో సెక్రటేరియట్లో మొత్తం కంప్యూటర్స్, ఫోన్స్, హార్డ్‌వేర్, టీవీలు, ఎలక్ట్రానిక్స్ సహా కలిపి రూ. 320కోట్లకు పైగా ఖర్చు దాటిందని విజిలెన్స్ పేర్కొంది. కనీస నిబంధనలు పాటించకుండా ఐటీ విభాగానికి చెందిన పరికరాలను కొనుగోలు చేసినట్లు తేల్చింది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
బిల్లులు మంజూరు చేయకుండానే నిధులను విడుదల చేసినట్లు గుర్తించింది. రూ. 320 కోట్లకు పైగా నిధుల విడుదలకు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చేసింది. ఇప్పటి వరకు ప్రభుత్వం సెక్రటేరియట్ వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. దాదాపుగా ఇప్పటివరకు రూ. 500 కోట్ల నుంచి రూ. 600 కోట్ల వరకు ప్రభుత్వం సదరు సంస్థకు నిధులను విడుదల చేసింది. మొత్తం అంచనా రూ. 15 వందల కోట్ల వరకు ఉంటుందని విజిలెన్స్ తాత్కాలిక రిపోర్టులో పేర్కొంది.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.