KCR: BRS అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడాన్ని సవాలు చేస్తూ గురువారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యేలా తగిన చర్యలు తీసుకునేలా స్పీకర్, శాసన సభాపతి కార్యాలయానికి ఆదేశాలివ్వాలని కోరుతూ... తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.విజయ్‌పాల్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
2023 డిసెంబరు 16న ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ (కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు) ఇప్పటి వరకు అసెంబ్లీకి రాకున్నా శాసన సభాపతి, స్పీకర్ కార్యాలయం తగిన ప్రొసీడింగ్స్ చేపట్టలేదన్నారు. ప్రజల గళాన్ని అసెంబ్లీలో వినిపించడానికి ఎమ్మెల్యేలకు వేతనాలను కూడా పెంచారని చెప్పారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
ప్రతిపక్ష నేతగా కేసీఆర్ విధులు నిర్వహించలేకపోతే ఆ బాధ్యతల నుంచి తప్పించి, కొత్త వారిని ఎంపిక చేసేందుకు BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు. కోర్టు ముందుకు మొదటిసారి ఇలాంటి పిటిషన్ వచ్చిందని, శాసన వ్యవస్థ, అధికారులు తీసుకునే రాజకీయ, ఆర్థిక నిర్ణయాలను సమీక్షించే విస్తృతాధికారం న్యాయ వ్యవస్థకు ఉందని పేర్కొన్నారు. ఇందులో ప్రతివాదులుగా స్పీకర్, శాసన సభాపతి కార్యాలయంతోపాటు కేసీఆర్, కేటీఆర్‌లను పేర్కొన్నారు. ఈ పిటిషన్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.