MLA Gunmen Spot Dead: రోడ్డుపై వెళ్తుండగా దారిపై అడ్డువచ్చిన అడవి పందిని ఢీకొట్టిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ ఎమ్మెల్యే గన్‌మెన్ దుర్మరణం పాలయ్యాడు. ఊహించని రీతిలో అతడి మరణం సంభవించింది. ఈ సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే, అతడి కుటుంబసభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అడవిపంది ప్రాణం తీయడంతో మృతుడి కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగింది. తెలంగాణలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Baby Born: 'కలయిక' లేకుండానే సంతానం .. పిల్లలను కనాలంటే ఇకపై మహిళలు అవసరం లేదు
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం బుల్కాపూర్ గ్రామానికి చెందిన ముత్తంగి శ్రీనివాస్ (28) కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించేవాడు. వికారాబాద్ ఏఆర్ కానిస్టేబుల్‌గా ఉన్న శ్రీనివాస్ ప్రస్తుత చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య గన్‌మెన్‌గా పనిచేస్తుండేవాడు. ఓ పనిపై ద్విచక్ర వాహనంపై సంగారెడ్డి జిల్లా బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెళ్తున్నాడు. కొండకల్ గ్రామం నుంచి వెలిమెల వరకు తన బైక్‌పై వెళుతుండగా వెలిమెల తండా గ్రామం శివారు వద్దకు చేరుకోగానే అకస్మాత్తుగా అడవి పంది దూసుకువచ్చింది.
Also Read: KP Chowdary: గోవాలో 'కబాలి' నిర్మాత ఆత్మహత్య.. సినీ పరిశ్రమలో విషాదం
అనూహ్యంగా రోడ్డుపై వేగంగా అడవి పంది రావడంతో ఆ జంతువు ఏమిటో తెలియక ఆందోళన చెందాడు. అంతేకాకుండా బైక్‌కు అడ్డంగా దూసుకురావడంతో వేగంతో వస్తున్న శ్రీనివాస్ దానిని ఢికొని కిందపడ్డాడు. దీంతో శ్రీనివాస్ రోడ్డుపై పడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నార. పోలీస్ ప్రక్రియ అనంతరం శ్రీనివాస్ మృతదేహాన్ని పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తన గన్‌మెన్ మృతి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాలే యాదయ్య పటాన్‌చెరులోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి నివాళులర్పించారు. 'శ్రీనివాస్ సౌమ్యుడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. నాలుగు సంవత్సరాలపాటు నా వద్ద గన్‌మెన్‌గా శ్రీనివాస్ పని చేస్తుండేవాడు. విధుల పట్ల కూడా శ్రీనివాస్ ఎంతో నిబద్ధతతో ఉండేవాడని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి