Hyderabad Casino Rocket: హైదరాబాద్ లో చట్ట విరుద్ధంగా ఎన్నో పనులు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల పోలీసులు మాముల్ల మత్తులో చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ శివారులో మొయినాబాద్ లో మరో అక్రమ కేసీనో గుట్టు రట్టు అయింది. వీటి వెనుక ఎవరున్నారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఈ ఫామ్‌హౌస్ BRS కు చెందిన ఓ ఎమ్మెల్సీదిగా గుర్తించారు. పోలీసులు చేసిన దాడిలో మొత్తం 61 మంది పట్టుపడ్డారు. వారి వద్ద నుంచి రూ. 30 లక్షల నగదు, కోటి విలువైన బెట్టింగ్ కాయిన్స్ పోలీసులు సీజ్ చేశారు. అంతేకాదు 50 కార్లు, 80 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో శివకుమార్ వర్మ కూడా ఉన్నాడు. కేసులో అతడిని ఏ1గా చేర్చారు. BRS ఎమ్మెల్సీ తొలుత తన ఫామ్‌హౌస్‌ను లీజుకిచ్చినట్లు చెప్పినా... పోలీసుల విచారణలో అది వాస్తవం కాదని వెల్లడైనట్లు తెలిసింది. దాదాపు రెండేళ్లుగా ఇక్కడ కోడిపందేలు, క్యాసినో నిర్వహిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీని నిందితుడిగా చేర్చాలని పోలీసులు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ ఆ MLC కి నోటీసులు ఇచ్చే అవకాశముంది.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.