kalvakuntla Kavitha: బిడ్డా రేవంత్.. పింక్ బుక్‌లో అన్ని రాస్తున్నాం.. మాస్ వార్నింగ్ ఇచ్చిన కవిత.. ఏమన్నారంటే..?

Kavitha fires on cm revanth reddy: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సీఎం రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సర్కారు చేస్తున్న తప్పుల్ని తాము.. పింక్ బుక్ లో ఎప్పటికప్పుడు రాసుకుంటున్నామని హెచ్చరించారు.   

Written by - Inamdar Paresh | Last Updated : Feb 13, 2025, 04:11 PM IST
  • మరోసారి కాంగ్రెస్ పై ఫైర్ అయిన కవిత..
  • అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా చెల్లిస్తామని వ్యాఖ్యలు..
kalvakuntla Kavitha: బిడ్డా రేవంత్.. పింక్ బుక్‌లో అన్ని రాస్తున్నాం.. మాస్ వార్నింగ్ ఇచ్చిన కవిత.. ఏమన్నారంటే..?

K Kavitha fires on cm revanth reddy government: తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా రాజకీయాలు మారిపోయాయి. తెలంగాణ గత బీఆర్ఎస్ అవినితీ పాలన వల్ల పదేళ్లు వెనుక్కు పోయిందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ.. అమలుకు సాధ్యం కానీ హమీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని రివర్స్ లో కౌంటర్ వేస్తుంది. మొత్తంగా ప్రస్తుతం రాజకీయాలు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లా రసవత్తరంగా మారాయి.

ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల మీద  ఒత్తిడి తీసుకొచ్చి అక్రమ కేసులు బనాయిస్తుందని బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి రేవంత్ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 
బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులపై తీవ్రంగా మండిపడ్డారు.

రేవంత్ సర్కారు చేస్తున్న అక్రమాలను తాము.. పింక్ బుక్ లో రాస్తున్నామని అన్నారు. అంతే కాకుండా..  అధికారంలోకి వచ్చిన వెంటనే రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని అన్నారు. లెక్కలు ఎలా రాయాలో  మీకే కాదు... మాకూ కూడా తెలుసన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. రైతు డిక్లరేషన్ పై నిలదీస్తారని.. రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో రేవంత్ ప్రభుత్వం తప్పుల్ని బైటపెడితే.. వెంటనే కేసులు పెడుతున్నారని అన్నారు. 

దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతున్నారని, తెలంగాణలో మాత్రం  రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే దగా, మోసం అని విమర్శించారు. కేసీఆర్ హయాంలో స్టేట్ లో.. నీళ్లు,  నిధులు, నియమకాలు జరిగాయన్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి భయపడి  2001 లో ఆఘమేఘాలపై దేవాదుల ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థానప చేశారని గుర్తు చేశారు.

కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ దాన్ని పైలేట్ ప్రాజెక్ట్ గా తీసుకుని దేవాదుల ప్రాజెక్టు పనులను చేయించారన్నారు. 95 శాతం పూర్తయిన సమ్మక్క సారక్క బ్యారేజీ పనులను కాంగ్రెస్ సర్కారు ఇంకా పూర్తి చేయలేని స్థితిలో ఉందన్నారు.  దీనిపై..

స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. కేవలం పదవుల కోసం కడియం పార్టీ మారారని ఎద్దేవా చేశారు.కడియం శ్రీహరిని ప్రజలు క్షమించే ప్రసక్తే లేదని,  పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిందని గుర్తు చేశారు. 

Read more: Kalvakuntla Kavitha: 'తెలంగాణలోని ప్రతి మహిళకు రేవంత్‌ రెడ్డి రూ.35 వేలు ఇవ్వాలి'

న్యాయ వ్యవస్థపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉందని, తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని కవిత అన్నారు. ఉప ఎన్నిక వస్తే .. పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా ఓడిపోవడం ఖాయమన్నారు. కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్ లు, రైతు భరోసా, తులం బంగారం, ఫీజు రియింబర్స్,  రుణమాఫీలు, విదేశీ స్కాలర్ షీప్ లు ఏమయ్యాయని కవిత రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News