Telangana Congress Posts: తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా పోస్టుల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కనీసం ప్రభుత్వంలో పోస్టు ఇవ్వని పక్షంలో పార్టీలోనైనా ప్రాధాన్యత కల్పించాలని హైకమాండ్ కమాండ్ పెద్దలను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్తగా నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ పోస్టులను పార్టీ కోసం కష్టపడిన నేతలకే ఇవ్వాలని చెప్పినట్టు తెలుస్తోంది. దాంతో వర్కింగ్‌ప్రెసిడెంట్ పోస్టును దక్కించుకునేందుకు పార్టీ నేతలు ఇప్పటికే లాబీయింగ్ షూరు చేసినట్టు సమాచారం.
వాస్తవానికి మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా ఆశలు పెట్టుకున్నారు. తమకు కేబినెట్‌లో ఎప్పుడు చోటు దక్కుతుందా అని ఎదురుచూస్తున్నారు. కానీ ఈసారి కూడా మంత్రి వర్గ విస్తరణను పక్కన పెట్టేసిన హైకమాండ్.. పార్టీ పదవులను మాత్రం భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈసారి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియమకానికి పచ్చజెండా ఊపిందట. ఈ పోస్టులను ఎస్సీ, ఎస్టీ, రెడ్డి, మైనారిటీ సామాజికవర్గ నేతలకు ఇవ్వాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అలాగే ఇతర పోస్టులను భర్తీ చేస్తారని ప్రచారం సాగుతోంది. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ రేసులో రెడ్డి కోటాలో ఖైరతాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ రోహిణ్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక ఎస్సీ కోటా నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఎస్టీ కోటా నుంచి బలరాం నాయక్, మైనారిటీ కోటాలో ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్ పోటీ పడుతున్నారు. వీళ్లంతా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును దక్కించుకుని తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఊవ్విళ్లూరుతున్నారు. అలాగే ఉపాధ్యక్ష పదవులు, ఇతర పోస్టుల నియామకంలోనూ బీసీ, ఇతర సామాజికవర్గాలకు న్యాయం చేసేలా ప్రణాళికలు సిద్దం చేసినట్టు సమాచారం. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలకు ఈసారి పార్టీలో కీలక పోస్టులు దక్కే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
Also Read: Kiran Royal illegal Affairs: జనసేన నేత కిరణ్ రాయల్ భాగోతాలు త్వరలో సస్పెన్షన్ వేటు
Also Read: Tirumala: తిరుమల భక్తులకు అలెర్ట్.. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter