CM Revanth reddy 2 sarees for womens: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు భారీ గుడ్ న్యూస్ చెప్పారు. ఇక మీదట ఏడాదికి రెండు కాస్లీ చీరలు ఇస్తామని ప్రకటించారు . తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నారాయణ పేటలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. మహిళలను అన్ని రంగాల్లో దూసుకొని పోయేలా చేస్తామన్నారు. అంతే కాకుండా.. తమ ప్రభుత్వం కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేయడమే టార్గెట్గా పెట్టుకుందన్నరు.
నారాయణపేటలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నడిచే పెట్రోల్ బంక్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దేశంలోనే తొలిసారి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్‌ను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. తమ సర్కారు మొదటి ప్రయారిటీ మహిళలే అన్నారు. వారు ఆత్మగౌరవంతో ఉండటమే తమకు కావాలన్నారు.
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా స్వయం సహాయక సంఘాలను పునరుద్ధరించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళా శక్తి 67 లక్షల మంది ఉన్నారని చెప్పుకొచ్చారు. 600 ఆర్టీసీ బస్సులకూ మహిళలను యజమానులను చేసినట్లు చెప్పారు.
మహిళ స్వయం సహాయక ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి శిల్పారామం వద్ద స్టాల్స్ ఏర్పాటు చేసి ఇచ్చామన్నారు. అదే విధంగా ప్రస్తుతం మహిళలకు తమ సర్కారు.. ఏడాదికి రెండు కాస్లీ చీరల్ని ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు.
Read more: CM Revanth Reddy: రంజాన్ వేళ ముస్లిం సోదరులకు సీఎం రేవంత్ మరో శుభవార్త.. స్టోరీ ఏంటంటే..?
పట్టణ, గ్రామీణ అని తేడా లేకుండా.. మహిళలు అందరికి అన్ని పథకాలు అందేలా చూస్తామన్నారు. అవసరమైతే...కేంద్రం మెడలు వంచి నిధులు తీసుకొస్తామన్నారు.దీని కోసం ఎంపీ డీకే అరుణ సాయం చేయాలన్నారు. ఇప్పటికే తమ సర్కారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుందని గుర్తు చేశారు. ఈక్రమంలో మహిళలు మాత్రం ఏడాదికి రెండు చీరలు అనడంతో ఫుల్ పండగ చేసుకున్నట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి