Business Man Murder Case in Punjagutta: రోజు రోజుకు హత్యలు దారుణాల సంఖ్య పెరగిపోతుంది. సమాజంలో బంధాలను కూడా మరిచిపోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇటీవలె సొంత భార్యను రిటైర్డ్ ఆర్మీ మీర్‌పేట్‌లో మర్డర్ చేసిన ఘటన సంచలనం సృష్టించింది. అత్యంత కిరాతకంగా హీటర్‌లో వేసి హత్య చేశాడు. ఈ ఘటన మరువక ముందే రాష్ట్రంలో మరో మర్డర్ సంచలనం సృష్టిస్తోంది.
నేడు మరో జరిగిన ఈ ఘటన హైదరాబాద్‌లోని పంజాగుట్టలో దారుణం చోటు చేసుకుంది. సొంత తాతను అత్యంత దారుణంగా మర్డర్ చేశాడు ఓ కిరాతక మనవడు. తన కంపెనీలో కోరిన పోస్ట్ తాత ఇవ్వలేదనే కోపంతో ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. పంజాగుట్టలో ఉండే పారిశ్రామిక వేత్త వెలమాటి చంద్రశేఖర్ దారుణ హత్యకు గురయ్యాడు. సొంత మనవడు అయిన కీర్తి తేజ ఆస్తి కోసం దాదాపు 73 సార్లు పొడిచి అత్యంత కిరాతకంగా మర్డర్ చేశాడు. అంతేకాదు ఈ దుర్మార్గాన్ని ఆపడానికి వచ్చిన తల్లిపై కూడా 12 సార్లు పొడిచాడు. ప్రస్తుతం ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది.
మొన్నటి వరకు అమెరికాలో ఉన్న కీర్తి తేజ ఇటీవలె హైదరాబాద్ వచ్చాడు. అయితే, పారిశ్రామిక వేత్త అయిన చంద్రశేఖరు మిగతా మనవల్ని చూసినట్లు తనన్ని చూడటం లేదని అక్కసు పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో చంద్ర శేఖర్ ఇటీవలె ఓ మనవడికి తన కంపెనీలో డైరెక్టర్ పోస్ట్ ఇచ్చాడు. ఆ పోస్ట్ తనకు ఇవ్వాలంటూ చంద్ర శేఖర్‌తో మనవడు కీర్తి తేజ వాగ్వాదానికి దిగాడు. ఈ సందర్భంలోనే తాత చంద్ర శేఖర్‌ను అత్యంత కిరాతకంగా 73 సార్లు పొడిచి చంపాడు కీర్తి తేజ.
ఇదీ చదవండి: బాబోయ్ మండే ఎండలు.. వేడి వాతావరణం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..
ఇక తాతను హత్య చేసి, తల్లిని తీవ్ర గాయాలపాలు చేసిన కీర్తి తేజ ఆ తర్వాత ఏలూరుకు పారిపోయాడు. అయితే, వీరిద్దరి అరుపులు విన్న స్థానికులు వెంటనే వారి వద్దకు వచ్చారు. విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, అప్పటికే చంద్ర శేఖర్ చనిపోయాడు. తల్లి తీవ్ర గాయాల పాలు అవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కీర్తి తేజను ఏలూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పారిశ్రామిక వేత్త చంద్ర శేఖర్ ప్రముఖ వెల్జాన్ కంపెనీకి చైర్మన్. వందల కోట్లు రూపాయల ఆస్తులకు అధినేత. ఆయన గతంలో కూడా టీటీడీ దేవస్థానానికి కూడా దాదాపు రూ.40 కోట్ల వరకు విరాళాలు ఇచ్చారు. ఈ హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. సొంత మనవడు తన తాతను చంపడంతో మానవ విలువలు తగ్గిపోతున్నాయి. రాను రాను మర్డర్ కేసులు పెరుగుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.