Kancharla Chandrasekhar Reddy: సినిమా విడుదల సందర్భంగా చోటుచేసుకున్న అనూహ్య పరిణామంతో అల్లు కుటుంబానికి తీవ్ర కష్టాలు వస్తున్నాయి. ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరోజు జైల్లో గడిపి వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వంతో శత్రుత్వం ఏర్పడడంతో అల్లు కుటుంబానికి వరుస కష్టాలు ఎదురవుతున్నాయని ప్రచారం జరుగుతోంది. బన్నీ టార్గెట్‌గా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌కు మరో షాక్ తగిలే అవకాశం ఉంది. అతడి మామ చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని కూల్చే ప్రమాదం ఉంది. తన ఇంటిని కూల్చే అవకాశం ఉండడంతో బన్నీ మామ ప్రజవాణిలో ఫిర్యాదు చేశాడు. దీంతో మరోసారి అల్లు అర్జున్ కుటుంబ వ్యవహారం సినీ పరిశ్రమతోపాటు రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Also Read: Radish Juice: ముల్లంగిని ఇలా తీసుకుంటే 'కొవ్వు' కొండలా కరిగించేస్తుంది
ఏం జరిగింది?
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కేబీఆర్ పార్క్ ఉండగా.. దాని చుట్టూ రోడ్డు విస్తరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పార్క్ చుట్టూ ఉన్న ఇళ్లకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే సినీ నటుడు బాలకృష్ణతోపాటు పలువురు ప్రముఖుల ఇళ్లకు నోటీసులు ఇచ్చారు. వారిలో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. తన ఇంటిని కూల్చే అవకాశం ఉండడంతో ప్రభుత్వానికి మామ చంద్రశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజావాణిలో ఆయన ఫిర్యాదు చేశారు.
Also Read: Allu Aravind: రేవంత్ రెడ్డి- అల్లు అర్జున్ వివాదం.. అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు
నా ఇల్లు కూల్చొద్దు
కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్న అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఇంటి స్థలం కోసం ప్రజావాణికి హాజరయ్యారు. రోడ్డు విస్తరణలో భాగంగా తన ఇంటి స్థలం సేకరణపై పునరాలోచన చేయాలని అధికారులను కోరారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో చంద్రశేఖర్ రెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు. కేబీఆర్ పార్కు వద్ద రోడ్డు విస్తరణ లో తన ఇంటి స్థలం సేకరణ పై పునరాలోచన చేయాలని కోరారు.
ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ
అల్లు అర్జున్ మామ చేసిన విజ్ఞప్తిని అధికారులు పరిగణనలోకి తీసుకుంటారా? లేదంటే కూల్చివేస్తారా? అనేది ఉత్కంఠ నెలకొంది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఇరుకైన రోడ్లు ఉండడంతో ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే రోడ్డు విస్తరణ కోసం కొన్ని ఇళ్లకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. వాటిలో చంద్రశేఖర్ రెడ్డి ఇల్లు కూడా ఉండడంతో ఈ రోడ్డు విస్తరణపై అందరి దృష్టి పడింది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter