Hilarious incident caught on camera goes viral: టీవీ రిపోర్టర్ లైవ్‌లో ఉండగా అనుకోకుండా అక్కడ ఏదైనా జరిగి ఆ రిపోర్ట్ అర్ధాంతరంగా ఆగిపోవడం, లేదా ఆ ఘటన హాస్యాస్పదంగా ఉంటే ఆ లైవ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి దృశ్యాలు గతం మీరు ఎన్నో చూసుంటారు. కానీ ఆ తరహా వీడియోల్లో ఇంత ఫన్నీ వీడియో (Funny video) మాత్రం ఇంతకుముందు చూసుండరు... లేదా ఇలా కూడా జరుగుతుందా అని ఊహించి ఉండరు.
Bike Stunts viral video: ఇదిగో ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ కుర్రాడు బైక్‌పై స్టంట్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హీరో అయిపోదామని అనుకున్నాడేమో కానీ ఆ ప్రయత్నం కాస్తా బెడిసికొట్టడంతో రోడ్డుపై అందరి ముందు బొక్కబోర్లాపడి పరువు పోగొట్టుకున్నాడు. అంతటితోనే సరిపోతుందా.. ? ఆ తర్వాత మళ్లీ ఆస్పత్రికి వెళ్లి బైక్ స్టంట్స్‌లో తగిలిన గాయాలకు నాలుగు కుట్లు కూడా వేయించుకోవాల్సిందే కదా!! చత్తీస్గడ్కి చెందిన దీపాన్షు కబ్రా అనే ఐపీఎస్ ఆఫీసర్ ట్విటర్లో పోస్ట్ చేసిన వీడియో (Bike stunts video) ఇది.
జనవరి 5న సినీ ఫక్కీలో జరిగిన ఓ వివాహం ( Cinematic wedding ) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వివాహం ప్రత్యేకత ఏంటంటే... వరుడు ఒక్కడే కానీ వధువులు మాత్రం ఇద్దరు ఉన్నారు. అవును... మీరు చదివింది నిజమే.. ఒకే మండపంలో (Wedding mandap) తన లవర్స్ ఇద్దరిని వివాహం చేసుకున్నాడు వరుడు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో చూస్తే మీకు నవ్వాలో లేక ఏడ్వాలో అర్థం కాక తల పట్టుకోవడం ఖాయం. రైల్వే స్టేషన్లో రైల్వే ట్రాక్ క్రాస్ చేయబోయిన ఓ వ్యక్తి కాలి బూటు జారడంతో మళ్లీ పట్టాలపైకి వెళ్లి బూటు తీసుకున్నాడు. అదే సమయంలో ప్లాట్‌ఫామ్‌పైకి రైలు వస్తుండటంతో అక్కడే ఉండలేక మళ్లీ వచ్చి ప్లాట్ ఫామ్ ఎక్కేందుకు ప్రయత్నించాడు.
ఫుట్ బాల్ ఆటగాడు క్రికెట్ ఆడి, ఫుట్ బాల్ని హ్యాండిల్ చేసినట్టుగానే క్రికెట్ బాల్ని క్యాచ్ పడితే చూడ్డానికి ఆ దృశ్యం ఎలా ఉంటుంది ? ఏంటి అర్థం కాలేదా ? అయితే మీరు ఈ దృశ్యం చూడాల్సిందే. మామూలుగా అయితే, క్రికెట్లో డైవ్స్ చేసి, గాల్లోకి పైకి ఎగిరి అతికష్టమైన క్యాచ్‌లు పట్టడం చూస్తుంటే వావ్.. అమేజింగ్ అనిపించకమానదు.
ఆనందం వచ్చినప్పుడు, ఏదైనా సాధించిన సంతోషంలో ఉన్నప్పుడు మనం ఒకరికొకరం హై-ఫైవ్ ( Hi-fives ) ఇచ్చుకుంటుంటాం. కానీ నీళ్లలో ఉండే మొసలి, తాబేలు ఒకదానికొకటి హై-ఫైవ్ ఇచ్చుకుంటాయని ఎవరైనా ఊహిస్తారా ? ఎవ్వరూ ఊహించరు. ఎందుకంటే తాబేలు కనబడిందంటే చాలు మొసలి దానిని గుటుక్కున మింగేస్తుంది కనుక.
పంట పొలాల్లో కొండచిలువలు ( Pythons ) ప్రత్యక్షమైతే ఇంకేమైనా ఉందా ? అది కూడా రెండు భారీ కొండ చిలువలు పంట పొలాల్లో కనపడటం చూసిన రైతులు ( Farmers ) తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సీగల్ అనే పక్షి ( Seagull ) ఎక్కువగా సముద్ర ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. ఇవి బీచ్‌లో సరదాగా కాలక్షేపం చేయడానికి వచ్చిన వారి దగ్గర ఉండే చిరుతిండిని దొంగిలించడం వీటికి బాగా అలవాటు. అలా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో వీటికి మంచి ఉదాహరణ అని చెప్పుకోవచ్చు.
స్మిమ్మింగ్ పూల్‌లో ( Swimming pool ) సరదాగా ఈత కొడదామని వెళ్లిన ఓ యువతికి అక్కడ అంతే సరదాగా ఓ చేదు అనుభవం ఎదురైంది. తానొకటి తలిస్తే.. దైవం మరొకటి తల్చినట్టు స్విమ్మింగ్ పూల్‌లో అందరిలాగే సరదాగా ఎంజాయ్ చేద్దామని ఆమె భావిస్తే.. అక్కడ మరోలా జరిగింది.
Cobra enters man's pants: మీర్జాపూర్: నాగుపాము పేరెత్తితేనే కొంతమందికి వణుకు పుడుతుంది.. ఇంకొంతమందికి దానిని చూస్తే చాలు ఆమడ దూరం పారిపోతారు. మరి అదే నాగుపాము ఒకవేళ ప్యాంట్‌లోకి చొరబడిందని తెలిస్తే.. అతడి పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి... ఏంటి ఊహకు కూడా అందడం లేదు కదా!
ఆకలేస్తోంది కదా అని హోటల్‌కి వెళ్లి మసాలా దోశ ( Masala dosa ) ఆర్డర్ ఇచ్చి.. ఆ వేడి వేడి మసాలా దోశను వచ్చీరాగానే ఆరగించడం ప్రారంభించిన ఓ వ్యక్తికి సగం దోశ తిన్నాకా తెలిసింది.. తాను తింటున్న సాంబార్లో బల్లి ( Lizard in sambar ) పడిందని!! అన్నింటికి మించి ఆ బల్లి సగమే ఉండి ఇంకో సగం భాగం కనిపించకపోవడం అతడిని మరింత కలవరపెట్టింది.
స్నేహితులు అందరి ముందే గాళ్‌ఫ్రెండ్‌కి తన లవ్ ప్రపోజ్ ( Love proposal ) చేసి ఆమెను తన ప్రేమలో పడేయాలనుకున్నాడు లోగన్ జాన్సన్ అనే వ్యక్తి. అనుకున్నట్టుగానే స్నేహితులు చూస్తుండగానే చెరువు ఒడ్డున నిలబడిన తన గాళ్‌ఫ్రెండ్ ( Girlfriend ) మారియా గుగ్లోట్ట వద్దకు వెళ్లబోయాడు. కానీ అంతకంటే ముందే బ్యాడ్ లక్ అతడిని కిందపడేసింది.
Trending Video Of the Day: కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ పెరుగుతున్న సమయంలో తమ ప్రాణాలకు తెగించి మరి పేషెంట్లకు వైద్యం చేస్తున్న డాకర్లు ( Doctors ), విధులు నిర్వహిస్తున్న పారామెడికల్ సిబ్బంది ( Paramedical), పోలీసులు, యాంబులెన్స్ డ్రైవర్లు, జర్నలిస్టులు, పారిశుధ్య కార్మికులు అందరూ మానవత్వం అంటే ఏంటో నిరూపించిన వారే.
Bhadradri Ramalayam: భద్రాద్రిలో బుధవారం అద్భుతం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. భద్రాద్రి రాముడి ఆలయంపై ( Bhadrachalam temple ) ఆకాశంలో సూర్యుడి చుట్టూ సప్త వర్ణాలతో ఓ వలయాకారం ఏర్పడగా.. అదే సమయంలో ఓ సూర్య కిరణం ప్రత్యేకంగా ఆలయ శిఖరాన్ని తాకినట్టు కనిపించిందని.. చూడటానికి ఆ దృశ్యం అద్భుతంగా ఉందని స్థానికులు చెబుతున్నారు.
లాక్ డౌన్ సమయం కావడంతో సోషల్ మీడియాలోకి ఎటువంటి ఆసక్తికరమైన వీడియో వచ్చినా.. అది వెంటనే వైరల్ అయిపోతోంది. అలాంటి వీడియోల్లో ఇది కూడా ఒకటి. కప్పే కదా.. ఏం చేస్తుంది లే అని లైట్ తీస్కోవద్దు.. కోపమొస్తే కప్ప అయినా తిరగబడుతుందనిపించేలా ఉన్న ఈ గమ్మత్తయిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
లాక్‌డౌన్‌ను పాటిస్తేనే కానీ కరోనా వైరస్‌ను నియంత్రించడం సాధ్యం కాదు. అందుకే ప్రపంచదేశాలన్నీ విధిగా లాక్ డౌన్, సోషల్ డిస్టన్స్ నిబంధనలను పాటిస్తూ కరోనాను నివారించేందుకు కృషి చేస్తున్నాయి. ఇంట్లోంచి బయటికొస్తే చాలు... కరోనా వైరస్ ఏ వైపు నుంచి దాడి చేస్తుందో తెలియని పరిస్థితి దాపురించింది.
కరోనావైరస్‌ని అరికట్టేందుకు యావత్ దేశవ్యాప్తంగా కేంద్రం లాక్డౌన్ విధించడంతో జనం అంతా ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. దేవాలయాలకు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో నవరాత్రుల సందర్భంగా మహిళలు అందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఇలా తమ తమ ఇంట్లోని బాల్కనీల నుండే దుర్గాదేవికి హారతి ఇచ్చారు.
కూర్చున్న చెట్టు కొమ్మనే నరుక్కుంటే ఏం జరుగుతుందో తెలిసిందే కదా ? తలకాయ ఉన్నోడు ఎవ్వరూ ఆ పని చేయరు. ఒకవేళ చేస్తే ఏం జరుగుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిగో సరిగ్గా ఇక్కడ కూడా అటువంటిదే జరిగింది. తాను నిలబడిన చోట ఉన్న పైకప్పు దేనిపైనైతే ఆధారపడి ఉందో.. దానినే కూలగొట్టబోయాడు ఓ కుర్రాడు. కానీ అంతిమంగా ఏం జరిగిందో ఈ వీడియోలో మీరే చూడండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.