COVID-19 tests in Telangana | హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆసుపత్రుల్లో మరణించిన వారికి కూడా కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేయాలన్న రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో దేశంలోని ప్రైవేటు సంస్థలకు సుప్రీంకోర్టు భారీ రిలీఫ్ ను ఇచ్చింది. దాదాపు రెండు నెలల పాటు లాక్ డౌన్ అమలుకాగా, ఎన్నో కంపెనీలు మూత పడ్డ విషయం తెలిసిందే..
Nimmagadda Ramesh Kumar అమరావతి: ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపును రద్దు చేస్తూ గత వారం ఏపీ హై కోర్టు (AP high court ) ఇచ్చిన సంచలన తీర్పును సవాలు చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీం కోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల క్రితం జూన్ 1న సుప్రీం కోర్టులో ఈ వివాదంపై ఏపీ సర్కార్ స్పెషల్ లీవ్ పిటిషన్ ( SLP petition ) దాఖలు చేయగా.. ఎట్టకేలకు సుప్రీం కోర్టు రిజిస్ట్రీ శుక్రవారం స్పెషల్ లీవ్ పిటిషన్ నెంబర్ కేటాయించింది.
కరోనా మహమ్మారి కాలంలో విస్తృతంగా వెలుగులోకి వచ్చిన ప్రత్యేకమైన అప్లికేషన్ జూమ్. లాక్ డౌన్ కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు పరిపాలన, శాఖాపరమైన సేవలు వినియోగించుకున్న సంగతి తెలిసిందే..
కరోనా నిర్ధారణ పరీక్షలు అందరికీ ఉచితంగా నిర్వహించాలని గతంలో పేర్కొన్న సుప్రీం కోర్టు తాజాగా తన నిర్ణయాన్ని సవరించుకుంది. కరోనా టెస్టులు పేదవారికి మాత్రమే ఉచితంగా చేయాలని స్పష్టం చేసింది. ఇందులో ఉచితంగా కరోనా టెస్టులు వర్తింపజేయాలనే అంశాన్ని
దేశ వ్యాప్తంగా నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో పీఎం కేర్స్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై సోమవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.
నిర్భయ కేసులో దోషులకు ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి. వారికి రేపే ఉరి శిక్ష అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. తీహార్ జైలు ఉన్నతాధికారులు ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
నిర్భయ కేసులో అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి. రేపు యథాప్రకారం నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష అమలు చేసే అవకాశం ఉంది. చివరి నిముషంలో ట్విస్ట్ ఎదురైనప్పటికీ సుప్రీం కోర్టు చెక్ పెట్టేసింది.
నిర్భయ కేసు మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే చాలాసార్లు కోర్టులు డెత్ వారెంట్లు జారీ చేసినా . . వారి ఉరిశిక్ష అమలుకు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా మరో దోషి పవన్ గుప్తా.. సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. దీంతో ఉరి శిక్షపై మరోసారి ఉత్కంఠ రగులుతోంది.
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కర్ర విరగకుండా, పాము చావకుండా తీర్పు చెప్పింది సుప్రీం కోర్టు. ఏపీలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న క్రమంలో స్థానిక ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఐతే ఈ నిర్ణయంపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు.
మధ్య ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ పంచాయతీ సుప్రీం కోర్టుకు చేరిందా? అయితే గత కొన్ని రోజులుగా రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. మద్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్ష మార్చి 26కు వాయిదా పడడంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వెంటనే బలపరీక్ష చేపట్టాలని
నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష తేదీ ఖరారైంది. నిజానికి వారికి మార్చి 3నే ఉరి శిక్ష అమలు చేయాలని కోర్టు తీర్పు చెప్పింది. కానీ వారికి న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది.
2012 నాటి అత్యంత హేయమైన నిర్భయ కేసులో తుది అంకానికి సర్వం సిద్ధమవుతోంది. దోషులకు ఉరి శిక్ష అమలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఢిల్లీలోని పాటియాలా హౌజ్ కోర్ట్ డెత్ వారెంట్ పై స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో ఉరి శిక్ష అమలుపై ఉత్కంఠ తొలగిపోయింది.
నిర్భయ కేసులో దోషులు ఎలా ఉన్నారు..? చివరి రోజుల్లో వారి మానసిక పరిస్థితి ఏంటి..? తీహార్ జైలులో వారి చివరి కొరికలు నెరవేరుతాయా..? నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష తేదీ ఖరారైంది. మార్చి 3 న వారికి ఉరి శిక్షలు అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
నిర్భయ కేసులో దోషిగా ఉన్న ముఖేష్ కు సుప్రీంలో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. అతను పెట్టుకున్న పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. దీంతో నిర్దిష్ట సమయానికి నిర్భయ కేసులో దోషులను అందరికీ ఉరి శిక్ష అమలు చేసేందుకు మార్గం సుగమమైంది.
ఆగస్టు 5న నిలిపివేసిన ఇంటర్ నెట్ సేవలు కశ్మీర్ ప్రజలకు నేడు అందుబాటులోకి వచ్చాయి. అయితే 2జీ స్పీడుతో పోస్ట్ పెయిడ్, ప్రి పెయిడ్ మొబైల్ యూజర్స్ అందరికీ సేవల్ని పునరుద్ధరించారు.
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. పౌరసత్వ సవరణ చట్టం-CAA-2019పై దేశవ్యాప్తంగా రగడ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో CAA-2019 చట్టాన్ని రద్దు చేయాలని కేంద్రానికి సూచించే విధంగా సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అన్ని పిటిషన్లు సుప్రీం ధర్మాసనం ఈ రోజు విచారణకు స్వీకరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలకు షెడ్యూల్ ప్రక్రియ విడుదల చేయడానికి రెండు రోజులు మాత్రమే ఉన్న తరుణంలో, సుప్రీంకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలకు స్టే విధించడం ద్వారా ప్రభుత్వానికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. 50 శాతానికి మించి
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.