Podu Bhoomulu Pattas: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు, పోడు భూముల పట్టాల పంపిణీ, తదితర అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మంగళవారం నాడు సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
MP Soyam Bapu : పెళ్లి వేడుకల్లో సోయం బాపు చిందులు వేశారు. తన కొడుకు పెళ్లి వేడుకల్లో సోయంబాపురావు సందడి చేశారు. వివాహా అనంతరం ఆదివాసి సంప్రదాయ పాటలకు డ్యాన్సులు వేశారు. బంధుమిత్రులతో ఉత్సాహంగా కనిపించారు.
Dasoju Sravan : రెండు వేల నోట్ల రద్దు అనేది పెద్ద స్కాంలా కనిపిస్తోందని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. దీనిపై విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీని వల్ల దేశానికి ఎలా ప్రయోజనం అవుతుందో చెప్పాలని డిమాండ్ చేశాడు.
CM KCR : తెలంగాణ కేటినేట్ సమావేశం నేడు జరగనుంది. కొత్త సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రి వర్గ భేటీ జరుగుతుంది. పలువురు ఉన్నతాధికారులు కూడా హాజరుకానున్నారు. కొత్త సచివాలయంలో తొలి భేటి అవ్వడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.
CM KCR : ఇవాళ, రేపు సీఎం కేసీఆర్ వరుస సమావేశాలతో హీట్ పెంచబోతోన్నారు. మధ్యాహ్నం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాలు జరగన్నాయి. కొత్త సచివాలయంలో మొదటి సారిగా భేటీ జరగనుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఉంటాయా? అనే దానిపై చర్చించుకోనున్నారు.
BRS Party : బీఆర్ఎస్ పార్టీలోకి మహారాష్ట్ర నుంచి చేరికలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర నేతలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో పలువురు ముఖ్య నేతలు పార్టీ కండువా కప్పుకున్నారు. ముంబై మహా నగర మాజీ మేయర్ కూడా బీఆర్ఎస్లో చేరారు.
KCR Govt : ఈ నెల 9న సాయంత్రం ఐదు గంటల్లోపు పంచాయితీ కార్యదర్శులు విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. డ్యూటీలో చేరకపోతే విధుల్లోంచి తొలగిస్తామని హెచ్చరించింది. జూ. పంచాయితీ కార్యదర్శులు సమ్మె చేయడంపై సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Priyanka Gandhi : తెలంగాణ అమరవీరులు ఏ లక్ష్యంతో అయితే ఉద్యమం చేశారో.. ఆ లక్ష్యం నెరవేరడం లేదని ప్రియాంక గాంధీ అన్నారు. సరూర్ నగర్లో నిర్వహించిన యువ సంఘర్షణ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం నిప్పులు చెరిగింది.
Minister Puvvada : మరో ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతోన్నాయని, తనను గెలిపించాలని, తన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించమని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. కేసీఆర్ వెంట ఉండి వేల కోట్లు సంపాదించిన పొంగులేటి ఇప్పుడు ఇలా మాట్లాడటం సరికాదని అన్నాడు.
Police Dept : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైద్రాబాద్ నగరంలో కొత్తగా నలభై పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని జీవో జారీ చేసింది. హైద్రాబాద్లో పన్నెండు ఏసీపీ జోన్లు, సైబరాబాద్లో మూడు డీసీపీ జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Revanth Reddy About ORR Scam: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో ప్రభుత్వం భారీ ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆరోపించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై పలు సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఫామ్ హౌజ్లో, కేటీఆర్ విదేశాల్లో స్థిరపడినా వందల కోట్లు వచ్చిపడేలా ఆదాయ వనరులు ప్లాన్ చేశారన్నారు.
Telangana Rains : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు విస్తారంగా పడుతున్నాయి. పంట నష్టపోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు ఆందోళన చెందొద్దని కేసీఆర భరోసానిచ్చాడు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చాడు.
KCR : రాజకీయ చైతన్యం కలిగిన మహారాష్ట్రలో రోజురోజుకూ పరిపాలన దిగజారిపోతోందని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ అన్నారు. చైతన్య వంతులున్న మహారాష్ట్రలో పరిస్థితులు బాగాలేదన్నారు. గుణాత్మకమైన అభివృద్దిని తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది అని అన్నారు.
YS Sharmila : ఖమ్మం జిల్లాలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటిస్తారు. వైరా, ఇల్లందు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ నష్టపోయిన రైతులతో మాట్లాడనున్నారు. దెబ్బ తిన్న పంటకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
KCR About Telangana New Secretariat Building: అనేక త్యాగాలతో, శాంతియుత పార్లమెంటరీ పంథాతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, అనతి కాలంలోనే దేశానికే ఆదర్శవంతమైన రాష్ట్రంగా భారత దేశాన విరాజిల్లుతున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రేపు ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త సెక్రటేరియట్ బిల్డింగ్ ప్రారంభోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ నూతన సచివాలయం గురించి పలు అంశాలను మీడియాతో పంచుకున్నారు.
KCR : దళిత బంధు కోసం లంచం తీసుకున్న ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్ వార్నింగ్ ఇచ్చాడు. అందరి చిట్టా తన వద్ద ఉందని, కొందరు ఎమ్మెల్యేలు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు తీసుకున్నారని అన్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.