RCB Captain: కోహ్లీ కాదు.. కెప్టెన్‌గా యంగ్ ప్లేయర్‌ను ప్రకటించిన ఆర్‌సీబీ

Rajat Patidar: ఆర్‌సీబీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2025 సీజన్‌కు రజత్ పటిదార్ పేరును కెప్టెన్‌గా ప్రకటించింది. అందరూ కోహ్లీ మరోసారి కెప్టెన్ అవుతాడని అనుకోగా.. ఆర్‌సీబీ ఊహించని నిర్ణయ తీసుకుంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Feb 13, 2025, 01:40 PM IST
RCB Captain: కోహ్లీ కాదు.. కెప్టెన్‌గా యంగ్ ప్లేయర్‌ను ప్రకటించిన ఆర్‌సీబీ

Rajat Patidar: రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా యంగ్‌ ప్లేయర్‌కు అవకాశం దక్కింది. గత సీజన్‌ వరకు కెప్టెన్‌గా వ్యవహరించిన డుప్లెసిస్‌ను ఈసారి ఆర్‌సీబీ రిటైన్ చేసుకోలేదు. దీంతో విరాట్ కోహ్లీ మరోసారి కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరిస్తాడని అందరూ అనుకున్నారు. అయితే ఊహించిన విధంగా ఆర్‌సీబీ కొత్త పేరు తెరపైకి తీసుకువచ్చింది. ఈ సీజన్‌కు తమ సారథిగా రజత్ పాటిదార్ పేరును ప్రకటించింది. భువనేశ్వర్, కృనాల్ పాండ్యా పేర్లు కూడా వినిపించినా.. ఆర్‌సీబీ యాజమాన్యం మాత్రం పాటిదార్‌ వైపే మొగ్గు చూపించింది. భవిష్యత్ సీజన్లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాటిదార్ 2021 సీజన్ నుంచి నుంచి ఆర్‌సీబీ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.. మొత్తం 54 మ్యాచుల్లో 1598 రన్స్ చేశాడు. కొత్త కెప్టెన్ నాయకత్వంలోనైనా ఆర్‌సీబీ కప్ కొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఇప్పటివరకు ఐపీఎల్‌ ట్రోఫీ ఆర్‌సీబీకి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ప్రతి సీజన్‌కు ముందు 'ఈ సాలా కప్‌ నమ్‌దే' అని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకోవడం.. పాయింట్స్‌ టేబుల్‌లో టాప్-4 వరకు చేరుకోవడం.. కప్ కొట్టకుండానే ఇంటి ముఖం పట్టడం కామన్‌గా మారిపోయింది. దీంతో వచ్చే సీజన్‌లో అయినా కప్ సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కోహ్లీ మరోసారి కెప్టెన్సీ చేపడతారని అందరూ భావించారు. అయితే కోహ్లీ ఆసక్తి చూపించకపోవడంతో రజత్ పటిదార్‌ను ఆర్‌సీబీ ఎంపిక చేసింది. 

ఈ సీజన్‌లో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన పటిదార్.. టీమ్‌ను ఫైనల్‌ తీసుకువెళ్లాడు. ఆర్‌సీబీకి నాయకత్వం వహిస్తున్న ఎనిమిదో ఆటగాడిగా నిలవనున్నాడు. 2021లో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన పాటిదార్.. అప్పటి నుంచి ఆర్‌సీబీ తరుఫున ఆడుతున్నాడు. మెగా వేలానికి ముందు విరాట్ కోహ్లీ, యష్ ధయాల్‌తోపాటు పటిదార్‌ను ఆర్‌సీబీ రిటైన్ చేసుకుంది. అతడికి రూ.11 కోట్లు చెల్లించనుంది. కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, ఫిల్ సాల్ట్ వంటి స్టార్ ప్లేయర్లను ఆర్‌సీబీ ఈసారి వేలంలో దక్కించుకుంది.

Also Read: ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

Also Read:  Gold Rate Today: అందనంత ఎత్తుకు బంగారం ధరలు.. తులం లక్ష దిశగా పరుగులు.. నేటి ధరలు ఇవే   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News