Venus Transit Effect: మీన రాశిలోకి శుక్రుడు.. అవునన్నా కాదన్న ఈ రాశుల వారికి జరగబోయేది ఇదే..

Venus Transit In Pisces 2024: మీన రాశిలోకి మార్చి రెండవ తేదీన శుక్రుడు ప్రవేశించబోతున్నాడు. అయితే దీని ఎఫెక్ట్ కొన్ని రాశుల వారిపై ప్రతికూలంగా పడబోతోంది. దీంతో ఆ రాశుల వారికి కొన్ని సమస్యలతో పాటు సవాళ్లు ఎదురవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Feb 21, 2025, 10:20 PM IST
Venus Transit Effect: మీన రాశిలోకి శుక్రుడు.. అవునన్నా కాదన్న ఈ రాశుల వారికి జరగబోయేది ఇదే..

Venus Transit In Pisces 2024: అన్ని గ్రహాల్లోకెల్లా శుక్ర గ్రహానికి అరుదైన ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే ఈ గ్రహాన్ని సంపదకు విలాసవతానికి సూచికగా భావిస్తారు. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రేమ, ఆకర్షణ మొదలైన వాటికి శుక్రుడిగా పరిగణిస్తారు. ఏదైనా ఒక గ్రహం సంచారం చేయడం వల్ల ఏర్పడే ప్రభావం కంటే శుక్ర గ్రహం సంచారం చేయడం వల్ల ఏర్పడే ప్రభావం జీవితంలో ఎన్నో సానుకూల లాభాలను అందిస్తుంది. అందుకే లక్ష్మీదేవికి శుక్ర గ్రహానికి ప్రత్యేకమైన సంబంధం ఉందని భావిస్తూ ఉంటారు. అయితే మార్చి రెండవ తేదీన శుక్ర గ్రహం మీన రాశిలోకి సంచారిస్తుంది. ఈ సంచారం శని మీన రాశిలోకి ప్రవేశించక ముందే జరుగుతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి మంచి జరిగితే మరికొన్ని రాశుల వారికి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారిపై చెడు ప్రభావం పడుతుంది. ఈ సమయంలో ఏయే రాశుల వారిపై చెడు ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

సింహ రాశి

ముఖ్యంగా మార్చి రెండున మీన రాశిలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల సింహ రాశి వారిపై ఎంతో ఎఫెక్ట్ పడుతుంది. దీనివల్ల అనేక సవాళ్లు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగాల్లో ఆందోళనతో పాటు కెరీర్ జీవితంపై విరక్తి పుడుతుంది. అలాగే ఆర్థికపరంగా వస్తున్న సమస్యలు కూడా పెరిగే అవకాశాలున్నాయి. ఇంట్లో కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తుతాయి.. కాబట్టి ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా జీవితాన్ని ముందుకు సాగించడం చాలా మంచిది. కానీ తరతరాల ఆస్తుల నుంచి వస్తున్న విషయాల్లో వీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలున్నాయి..

కర్కాటక రాశి 
శుక్రుడి మీన రాశిలోకి ప్రవేశం కర్కాటక రాశి వారికి కూడా కొన్ని ఇబ్బందులు కలిగిస్తుంది. ముఖ్యంగా వీరికి బడ్జెట్ పరమైన సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అలాగే అనారోగ్య సమస్యలు కూడా రావచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఖర్చుల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండడం మేలని.. ఆస్తులపరంగా వస్తున్న సమస్యల్లో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇక ఉద్యోగాలు చేస్తున్నవారు సీనియర్లతో గొడవలు పడే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఉద్యోగ జీవితంలో కొన్ని సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ సమయంలో ఓపికతో ఉన్నవారికి అనేక రకాల లాభాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి కూడా ఈ సమయంలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి వీరు మార్చి రెండవ తేదీ నుంచి కాస్త జాగ్రత్తగా ఉండడం ఎంతో మంచిది.. అలాగే వీరు కెరీర్ పరంగా కూడా కొన్ని ఆటుపోట్లనే ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. కెరీర్ జీవితంపై ఫోకస్ చేస్తూ మరీ.. ఉద్యోగ జీవితంలో ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఈ సమయంలో వీరి ఆరోగ్యం కూడా క్షీణించే ఛాన్స్ ఉంది.. అలాగే అనేక రకాల ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండడం మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

వృషభ, కుంభ రాశి వారికి ప్రయోజనాలు
మీన రాశిలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల కుంభ రాశి వారితో పాటు వృషభ రాశి వారికి బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి కరీర్ పరంగా వస్తున్న అన్ని సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్ లభించడమే.. కాకుండా ప్రశంసలు కూడా పొందుతారు. ఆరోగ్యపరంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి..

Read more: Ar Rahman: రెహమాన్ దంపతులు మళ్లీ కలిసి పోతున్నారా..?.. వైరల్‌గా మారిన మాజీ భార్య పోస్ట్.. మ్యాటర్ ఏంటంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News