Venus Transit 2025: శుక్రుడి ఎఫెక్ట్‌.. ఈ రాశులవారికి లక్కీ లాటరీ తగిలినట్లే!

Venus Transit 2025 Effect On Zodiac Signs: శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల మార్చి 2వ తేదిన నుంచి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థిక పరంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Feb 22, 2025, 12:35 PM IST
Venus Transit 2025: శుక్రుడి ఎఫెక్ట్‌.. ఈ రాశులవారికి లక్కీ లాటరీ తగిలినట్లే!

Venus Transit 2025 Effect: జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహాన్ని ఆనందం, లగ్జరీ లైఫ్‌, డబ్బు, పరపతి, సంపదకు సూచికగా పరిగణిస్తారు. కాబట్టి ఈ గ్రహం సంచారానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహం జాతకంలో శుభస్థానంలో ఉంటే మనుషులకు వ్యక్తిగత జీవితంలో డబ్బు, ఆనందానికి లోటు ఉండదు. అలాగే వ్యాపారాలు చేసేవారికి డబ్బుకు డోకా ఉండదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత మీన రాశిలోకి శుక్రుడు ప్రవేశించబోతున్నాడు. మార్చి 2న ఈ సంచారం జరగబోతోంది. దీని వల్ల కొన్ని రాశులవారికి బంఫర్ లాభాలతో పాటు ఊహించని డబ్బు లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మిథున రాశి: 
మిథున రాశివారికి మార్చి 2వ తేది నుంచి బోలెడు బెనిఫిట్స్‌ కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి సంపదకు లోటు ఉండదు. దీంతో పాటు అద్భుతమైన లాభాలు పొందుతారు. ముఖ్యంగా కుటుంబ జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ఈ మార్పులు మిథున రాశివారికి శుభప్రదంగా మారుతాయి. అంతేకాకుండా ఆనందంతో పాటు వీరికి శ్రేయస్సు కూడా లభిస్తుంది. జీవితంలో ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఉద్యోగాల పరంగా కూడా ఎన్నో సానుకూల మార్పులు వస్తాయి. 

కుంభ రాశి: 
శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించడం కుంభ రాశివారికి చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి జీవితంలో అనేక సానుకూల మార్పలు వచ్చి బోలెడు లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగాల్లో పెరుగుతున్న ఒత్తిడి కూడా పూర్తిగా తొలగిపోతుంది. అలాగే వ్యాపారాల పరంగా వస్తున్న అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఆర్థిక స్థితిగతలు పూర్తిగా మారుతాయి. దీంతో పాటు ఆనందానికి ఎలాంటి లోటు ఉండదు. అలాగే డబ్బు సమస్యల కూడా పూర్తిగా తొలగిపోతాయి. 

Read more: Ar Rahman: రెహమాన్ దంపతులు మళ్లీ కలిసి పోతున్నారా..?.. వైరల్‌గా మారిన మాజీ భార్య పోస్ట్.. మ్యాటర్ ఏంటంటే..?

కన్య రాశి:
కన్య రాశి అద్భుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి శుక్రుడి అనుగ్రహం లభించి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారి ఈ సమయంలో ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. అలాగే కుటుంబ పరంగా వస్తున్న ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి. అలాగే కుటుంబ జీవితంలో శాంతి సంతోషాలు రెట్టింపు అవుతాయి. దీంతో పాటు ఆరోగ్యపరంగా వస్తున్న సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి కాస్త ఉపశమనం కలుగుతుంది. 

Read more: Ar Rahman: రెహమాన్ దంపతులు మళ్లీ కలిసి పోతున్నారా..?.. వైరల్‌గా మారిన మాజీ భార్య పోస్ట్.. మ్యాటర్ ఏంటంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News