Dating App Fraud: 'వాళ్లను' వదలని సైబర్‌ నేరగాళ్లు.. 'గే' యాప్‌లతో యువకుడి మోసం

Big Fraud With Use Of Gay Dating Apps In Hyderabad: సైబర్‌ క్రైమ్‌ నేరస్తులు డేటింగ్‌ యాప్‌లను అస్త్రంగా చేసుకుని దోచుకుంటున్నారు. తాజాగా గే యాప్‌ను వినియోగించుకుని ఓ యువకుడు మోసాలకు పాల్పడుతుండగా అతడిని అరెస్ట్‌ చేశారు. అతడి బారిన పెద్ద సంఖ్యలో బాధితులు ఉన్నట్లు సమాచారం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 10, 2025, 07:21 PM IST
Dating App Fraud: 'వాళ్లను' వదలని సైబర్‌ నేరగాళ్లు.. 'గే' యాప్‌లతో యువకుడి మోసం

Dating Apps Fraud: 'ప్రత్యేక వర్గం' బలహీనతను అతడు వాడుకుని మోసాలకు పాల్పడుతున్నాడు. డేటింగ్‌ యాప్‌ వినియోగించుకుని 'గే'లను మోసం చేస్తున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డేటింగ్‌ యాప్‌లలో 'గే'లను లక్ష్యంగా చేసుకుని ఓ ప్రబుద్ధుడు డబ్బులు వసూలు చేస్తుండడంతో అతడి ఆటలను పోలీసులు కట్టివేశారు. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Nagari Politics: రోజాకు చెక్‌.. వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడు?

హైదరాబాద్‌లోని డబీర్‌పురాలో నివసించే ఫర్హాన్‌ బేగ్ (25) జల్సాలకు అలవాటు పడ్డాడు. గే యాప్‌లతో సులభంగా డబ్బు సంపాదించాలనుకుని పథకం రచించాడు. ఈజీ మనీ కోసం ఓ గే యాప్‌ను ఉపయోగించుకుని 'గే'లను పరిచయం చేసుకుంటున్నాడు. వారిని తన వద్దకు రప్పించుకుని వీడియోలు తీస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నాడు. షేక్‌పేట జైహింద్‌నగర్‌కు చెందిన ఓ యువకుడి (22)ని జనవరి ఆ యాప్‌లో పరిచయం చేసుకుని తన వద్దకు రప్పించుకున్నాడు.

Also Read: Russell Viper Snake: కలెక్టరేట్‌లోకి దూరిన అత్యంత విషపూరిత పాము.. లేపాక్షి ఆలయంలో హల్‌చల్‌

ఇంటికి వచ్చిన సదరు యువకుడితో సన్నిహితంగా మెలుగుతూ వీడియో రికార్డ్ చేశాడు. అనంతరం ఆ వీడియో చూపించి బ్లాక్‌ మెయిల్ చేశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ వీడియోతో బెదిరించి రూ.15 వేలు డిమాండ్ చేశాడు. అయితే బాధితుడు రూ.10 వేలను చెల్లించాడు. ఫోన్ పే ద్వారా ఫర్హాన్ బేగ్‌ పంపించుకున్నాడు. అయితే ఈ డబ్బులు పంపించాక కూడా అతడు బెదిరింపులకు పాల్పడుతుండడంతో బాధితుడు ఈ నెల 1వ తేదీన ఫిలింనగర్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి ఫోన్ పే ఆధారంగా కాల్ డేటా సేకరించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఫర్హాన్‌ బేగ్ 'గే' కాదని.. డబ్బులు సంపాదించడానికి ఆ యాప్‌ను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. వారి బలహీనతను ఉపయోగించుకుని డబ్బులు వసూలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. అతడి బాధితులు మరికొందరు ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా ఇలాంటి బ్లాక్‌మెయిలింగ్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News