Tiger and wild boar fall down into well in Madhya Pradesh: సాధారణంగా అడవిలో ఉండే క్రూర జంతువులు సాధుజంతువుల్ని వేటాడుతుంటాయి. సింహాలు, పులులు, చిరుతలు తరచుగా జింకలు, అడవి దున్నలు, విల్డర్ బీస్ట్ లను వేటాడి తినేస్తుంటాయి. వేటలో భాగంగా క్రూర జంతువులు కొన్నిసార్లు దారితప్పి అడవికి దగ్గరగా ఉన్న గ్రామాల్లోకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలో క్రూర జంతువులు దాడులు చేసినప్పుడు సాధు జంతువులు ప్రాణాలకు తెగించి వాటి నుంచితప్పించుకునేందుకు ప్రయత్నిస్తాయి.
ఒక వైపు ఆకలి కోసం పోరాటం, మరోవైపు బతుకు కోసం ఆరాటం రెండు కూడా తరచుగా మనం చూస్తుంటాం. కొన్నిసార్లు వేటాడే జంతువులు గెలిస్తే, మరికొన్ని సార్లు సాధు జంతువులు కూడా తమ ప్రాణాలను కాపాడుకుంటాయి. ఈ క్రమంలో మధ్య ప్రదేశ్ లోని పెంచ్ నేషనల్ పార్క్ సమీపంలో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మధ్య ప్రదేశ్ లోని పెంచ్ నేషనల్ లో పెద్దపులులు ఎక్కువగా ఉంటాయి.
A Wild Rescue Like No Other ! When natural foes, a tiger and a boar fell into the same well near Pench Tiger Reserve. Instead of a fight, they found themselves in the same sinking situation 😳 Enter the real heroes, the Pench rescue team, who pulled off a mission as delicate as… pic.twitter.com/iQEKLxaRgL
— Supriya Sahu IAS (@supriyasahuias) February 4, 2025
ఇటీవల పిపారియా హర్దులీగ్రామంలో ఒక పెద్దపులి అడవి పందిని వేటాడుకుంటు వచ్చింది. పెద్దపులి బారి నుంచి తప్పించుకునేందుకు అడవి పంది తెగ ప్రయత్నించింది. కానీ పెద్దపులి దాని వెంటపడింది. అయితే.. అవి రెండు కూడా అక్కడ సమీపంలోని పొలంలోకి ప్రవేశించాయి. అక్కడ పొలంలో ఉన్న బావిలో పడిపోయాయి. దీంతో రెండు జంతువులు కూడా తమ ప్రాణాలు ఉంటే చాలని అనుకున్నాయి.
బావిలో పెద్దపులి, అడవి పంది పక్కపక్కనే ఉన్న.. కనీసం దాడులు చేసుకొవడం లేదు. వీటి అరుపుల్ని అక్కడున్న రైతులు విని బావిలో చూశారు. పెద్దపులి, అడవి పందిని చూసి వెంటనే ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ఫారెస్ట్ సిబ్బంది బోనును ఏర్పాటు చేసి, పెద్దపులిని తొలుత కాపాడారు. ఆ తర్వాత అడవి పందిని సైతం బోనులో ఎక్కేలా చేసి.. వాటిని అడవిలోకి వదిలేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter