National Anthem: జాతీయ గీతంపై అందరికీ గౌరవం ఉండాలి. దేశభక్తిపై గౌరవం ఉండాలని రాజ్యాంగ విధుల్లోనే ఒక నియమం ఉంది. కానీ అలాంటి విధిని ప్రస్తుతం మనం మరచిపోతున్న వేళ ఓ బుడ్డోడు చేసిన పనికి అందరూ ఆలోచనలో పడాల్సి వచ్చింది. జాతీయ గీతం విన్న బాలుడు వెంటనే రోడ్డుపై ఆగిపోయి గీతం అయిపోయేంత వరకు అలాగే నిలబడ్డాడు. గీతం అనంతరం 'జై హింద్' అంటూ గర్వంగా సెల్యూట్ చేసి ఇంటికి పరుగున వెళ్లాడు. ఏపీలో ఈ బుడ్డోడు చేసిన పనికి నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: BSNL 99 Plan: బీఎస్‌ఎన్‌ఎల్ సర్‌ప్రైజ్ ప్లాన్.. రూ.99తో అపరిమితమైన సేవలు
ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కరివేన గ్రామానికి చెందిన సాత్విక్ స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్నాడు. ఈ నెల 3వ తేదీన పాఠశాల వదిలిన అనంతరం యథావిధిగా ఇంటికి వెళ్తున్నాడు. తల్లి వెంట ఇంటికి వెళ్తుండగా పాఠశాల ప్రహరీ దాటగానే మైకులో జాతీయ గీతం జనగణమన ప్రసారమైంది. దీంతో ఒక్కసారిగా సాత్విక్ తన తల్లి చేయిని వదిలిపెట్టేసి రోడ్డుపై నిలబడ్డాడు.
Also Read: Zee Tv Sa Re Ga Ma Pa: ప్రతిష్టాత్మక వేదికలపై 'జీ సరిగమప' సింగర్‌ల అద్భుత ప్రదర్శన
రోడ్డుపై నిటారుగా నిలబడి జనగణమన గీతాన్ని ఆలపించాడు. గీతం ముగిసిన అనంతరం 'జై హింద్' అంటూ సెల్యూట్ చేశాడు. ఆ సెల్యూట్ కూడా ఎంతో గర్వంగా చేసి అనంతరం తల్లి వద్దకు వెళ్లాడు. ఈ దృశ్యాలు స్థానికంగా కొందరు రికార్డు చేశారు. నడిరోడ్డుపై రాకపోకలు సాగిస్తున్న వారితో సంబంధం లేకుండా జాతీయ గీతానికి సాత్విక్ తలవంచి నిమగ్నమైన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 'నీ దేశ భక్తికి హాట్సాఫ్ రా బుడ్డోడా' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వాడిని చూసి నేర్చుకోవాలి అంటూ మరికొందరు సూచిస్తున్నారు. జాతీయ గీతంపై గౌరవం పెంచుకోవాల్సిన అవసరం ఉందని గుర్తుచేస్తున్నారు.
బుడ్డోడి దేశభక్తి
జనగణమనకు రోడ్డుపై వందనం
నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కరివేన గ్రామానికి చెందిన సాత్విక్ ఎల్‌కేజీ చదువుతున్నాడు. ఈనెల 3న పాఠశాల నుంచి ఇంటికి వెళ్తుండగా జనగణమన వినపడగానే రోడ్డుపై ఆగిపోయాడు#AndhraPradesh #Nandyala #India #SRK @KTRBRS@naralokesh @anandmahindra pic.twitter.com/Soq6qqUR3Y
— SARAKU (Sateesh Ravi kumar) (@sargam_ravi) February 5, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.