Green Vine Snake: మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉన్న పాము ఇదే, ధర 1 కోటి రూపాయలు

Green Vine Snake: పాముల్ని చూస్తేనే కాదు పేరు వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంటుంది. అయితే కొన్ని రకాల పాములకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉందంటే నమ్ముతారా. ఇది ముమ్మాటికీ నిజం.కొన్ని పాముల ధరలు వెంటే మైండ్ బ్లాక్ అవడం ఖాయం

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 28, 2025, 06:19 PM IST
Green Vine Snake: మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉన్న పాము ఇదే, ధర 1 కోటి రూపాయలు

Green Vine Snake: భూమ్మీద చాలా రకాల పాములున్నాయి. దాదాపుగా 4 వేల వరకూ విభిన్న జాతుల పాములున్నాయని అంచనా. వీటిలో 900 వరకూ విషపూరితమైనవి కాగా మిగిలినవి విషం లేనివే.ఒక్కో పాము ఒక్కో రకంగా ఉంటుంది. కొన్ని పాములు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటి ప్రత్యేకమైన పాములకు మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంటుంది. 

మనం పాము పేరు వింటేనే ఆమడదూరం పారిపోతుంటాం. అలాంటిది కొన్ని దేశాల్లో  వీటిని ఇష్టంగా తింటారు. ఇంకొన్ని దేశాల్లో పాముల ఫార్మింగ్ ఉంటుంది. వివిధ రకాల మందుల తయారీలో వాడేందుకు పాముల విషం ఉపయోగపడుతుంది.దీనికోసం విషపూరితమైన పాముల్ని పెంచుతుంటారు. కొన్ని రకాల ప్రత్యేక పాములకు అంతర్జాతీయ మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంటుంది. అలాంటిదే ఈ పాము.ఈ పాము మన దేశంలోనే గుజరాత్ రాష్ట్రంలోని నవ్ సారి జిల్లా జొనాథన్ ప్రాంతంలో ఉంటుంది. ఇది పూర్తిగా లేత ఆకుపచ్చ రంగులో మెరుస్తూ ఉంటుంది. దీనిని గ్రీన్ వైన్ స్నేక్ అంటారు. ఇది చాలా అరుదుగా కన్పించే పాముగా చెబుతారు. 

ఈ పాము ఆకుల్లో కలిసిపోయి ఉంటుంది. నోరు త్రిభుజాకారంలో ఉండి కళ్లు రెడ్ కలర్‌లో ఉంటాయి. ఎక్కువగా చెట్లపైనే ఉండి ఒక చెట్టు నుంచి మరో చెట్టు పైకి దూకగలదు. మూడున్నర అడుగుల పొడుగు ఉంటుంది. పాక్షికంగా విషపూరితం. పసరపాము జాతికి చెందిన ప్రత్యేకమైన పాము ఇది. ఈ పాము కాటుతో ఎవరూ చనిపోలేదు. చిన్న చిన్న పక్షుల్ని, వాటి గుడ్లను ఆహారంగా తీసుకుంటాయి. 

ఈ పాముకు అంతర్జాతీయ మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. వీటి ధర 1 లక్ష రూపాయల్నించి కోటి రూపాయల వరకు ఉంటుంది. ప్రపంచ మార్కెట్‌లో అత్యంత డిమాండ్ కలిగిన పాముల్లో ఇదొకటి. 

Also read: Vijaya Sai Reddy: హార్టికల్చర్ వ్యవసాయం మొదలెట్టేసిన విజయసాయి రెడ్డి, ఫోటోలు వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News