New Sim Card Rules: సిమ్ కార్డు కొత్త రూల్స్, ఇకపై కొత్త సిమ్ అంత ఈజీ కాదు

New Sim Card Rules: కొత్త సిమ్ కార్డు నిబంధనలు వచ్చాయి. ఇకపై సిమ్ కార్డు తీసుకోవడం అంత సులభం కాదు. మోసాలు, నకిలీలను నియంత్రించేందుకు ట్రాయ్ కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 23, 2025, 11:15 AM IST
New Sim Card Rules: సిమ్ కార్డు కొత్త రూల్స్, ఇకపై కొత్త సిమ్ అంత ఈజీ కాదు

New Sim Card Rules: మొన్నటి వరకు సిమ్ కార్డు తీసుకోవాలంటే కేవలం ఆధార్ కార్డు జిరాక్స్ ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. టెలీకం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇక నుంచి సిమ్ కార్డు పొందాలంటే ఆ వెరిఫికేషన్ తప్పనిసరిగా మారింది. 

గత కొద్ది కాలంగా దేశంలో నకిలీ సిమ్ కార్డుల బెడద ఎక్కువగా ఉంది. నకిలీ సిమ్ కార్డులతో మోసాలు పెరిగిపోతున్నాయి. దాంతో నకిలీ సిమ్ కార్డుల్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రధానమంత్రి కార్యాలయం సంబంధిత టెలీకమ్యూనికేషన్ శాఖకు కీలకమైన సూచనలు జారీ చేసింది. కొత్తగా సిమ్ కార్డు మంజూరు చేయాలంటే ఆధార్ ప్రామాణికంగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పకుండా ఉండాలని స్పష్టం చేసింది. అంటే ఇక నుంచి కొత్త సిమ్ కార్డు కొనాలంటే విధిగా ఆ వ్యక్తి వెళ్లాల్సిందే. ఆధార్ కార్డు బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తయితేనే సిమ్ కార్డు మంజూరు చేయాల్సి ఉంటుంది. సైబర్ మోసాలు, నకిలీ సిమ్ కార్డుల్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

ఇప్పటి వరకు అయితే ఏదో ఒక ఐడీ కార్డు  లేదా ఆధార్ జిరాక్స్ చూపించి సిమ్ కార్డు తీసుకునేందుకు వీలుండేది. అంటే ఓటర్ ఐడీ లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డులు సరిపోయేవి. కానీ ఇప్పుడు ఆధార్ కార్డు వెరిఫికేషన్ తప్పనిసరిగా మారింది. ఆర్ధిక కుంభకోణాలు, మోసాలు, సైబర్ నేరాలతో పాటు అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు సిమ్ కార్డు నిబంధనలు కఠినతరమయ్యాయి.

సిమ్ కార్డు కొత్త మార్గదర్శకాలు, నిబంధనలు

ప్రతి మొబైల్ కనెక్షన్‌కు ఇకపై ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరిగా మారింది. కొత్త సిమ్ కార్డు మంజూరు చేసేటప్పుడు కస్టమర్ ఫోటోను 10 విభిన్న కోణాల్లో తీసుకోవాలి. ఓ వ్యక్తి పేరుపై రిజిస్టర్ అయిన అన్ని సిమ్ కార్డులను డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ ట్రాక్ చేస్తుంది. ఒకే డివైస్‌పై మల్టిపుల్ సిమ్ కార్డులు పనిచేస్తున్నట్టు గుర్తించి నకిలీలను తొలగిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో నకిలీ సిమ్ కార్డుల్ని గుర్తించి వారిపై తగిన చర్యలు తీసుకుంటారు. బయోమెట్రిక్ వెరిఫికేషన్ లేకుండా సిమ్ కార్డులు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయి. 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో సైబర్ నేరాలు తగ్గవచ్చు. నకిలీ డాక్యుమెంట్ల ద్వారా తీసుకున్న మొబైల్ కనెక్షన్లు రద్దవుతాయి. దేశవ్యాప్తంగా సిమ్ కార్డుల జారీ మరింత సెక్యూర్ అవుతుంది. 

Also read: LIC Pension Scheme: ఎల్ఐసీలో ఈ స్కీమ్ తీసుకుంటే మీకు, మీ భాగస్వామికి జీవితాంతం పెన్షన్/p>

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News