Game Changer Total Hindi Collections: సంక్రాంతి పండగ నేపథ్యంలో 2025లో ముందుగా విడుదలైన చిత్రం ‘గేమ్ ఛేంజర్’ కరోనా ముందు మొదలైన ఈ సినిమా ఎన్నో ఆటు పోట్లను తట్టుకుంటూ ఎట్టకేలకు విడుదలైంది. దర్శకుడుగా ఒకప్పుడు ప్యాన్ ఇండియాను శాసించిన శంకర్ ఈ సినిమాలో దర్శకుడిగా తన మార్క్ చూపించలేకపోయాడు. మొత్తంగా ఔట్ డేడెట్ కథ, స్క్రీన్ ప్లేతో నిర్మించిన ఈ సినిమా మొదటి ఆటతోనే ప్రేక్షకులు డిజాస్టర్ గా తేల్చారు. ఆ తర్వాత ఈ సినిమా ఏ విధంగా కోలుకోలేదు. ఈ సినిమాకు పోటీగా విడుదలైన చిత్రాలు మంచి టాక్ తెచ్చుకోవడంతో ‘గేమ్ చేంజర్’ మూవీ ఏ మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఇంపాక్ట్ చూపెట్టలేకపోయింది.
మంచి సబ్జెక్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా స్క్రీన్ ప్లే లోపాలతో అట్టర్ ఫ్లాప్ అయింది. మొత్తంగా శంకర్ ఈ సినిమా కోసం అవసరమైన దాని కంటే ఎక్కువ ఫుటేజీ తెరకెక్కించడం కూడా ఈ సినిమా వైఫల్యానికి కారణం అని చెప్పాలి.ఇక థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ కూడా ఈ సినిమా పెద్దగా ఇంపాక్ట్ చూపెట్టలేకపోయింది.
ఇక ఈ సినిమా హిందీలో కూడా భారీ ఎత్తున విడుదలైంది. ఆర్ఆర్ఆర్, ఆచార్యల తర్వాత సోలో హీరోగా రామ్ చరణ్ తొలి సినిమా బాలీవుడ్ లో విడుదలైంది. మొదటి రోజు డిసెంట్ వసూళ్లనే రాబట్టిన ఈ సినిమా ఆ తర్వాత ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. హిందీలో ఈ సినిమా రూ. 32.50 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఇక రెస్ట్ ఆఫ్ భారత్, హిందీలో కలిపి ఈ సినిమా ఫైనల్ రన్ లో రూ. 17.45 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
ఓవరాల్ గా హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి సినిమా ఫైనల్ రన్ లో 17.45 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుంది. కాగా సినిమా కి హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి…రూ. 42.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా హిందీలో సినిమా రూ. 25 కోట్ల మేర నష్టాలతో డబుల్ డిజాస్టర్ గా నిలిచి రామ్ చరణ్ కెరీర్ లో అతిపెద్ద డిజాస్టర్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.