Akira Nandan Debut: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జల్సా మంచి విజయం అందుకోగా.. అత్తారింటికి దారేది సినిమా ఏకంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ఆ తరువాత.. అజ్ఞాతవాసి సినిమా మాత్రం దిజాస్టర్ గా నిలిచింది. కానీ ఎప్పుడూ కూడా.. పవన్, త్రివిక్రమ్ మధ్య విభేదాలు కానీ దూరం కానీ రాలేదు. ఇప్పుడు, వీరి కుటుంబాల నుంచి కొత్త టాలెంట్.. సినీ రంగంలో అడుగుపెట్టబోతున్నట్లు టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది.
పవన్ కుమారుడు అకీరా నందన్ ఎంట్రీపై ఇప్పటికే ఆసక్తి కొనసాగుతుండగా, తాజాగా త్రివిక్రమ్ కొడుకు రిషి మనోజ్ కూడా దర్శకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం, అకీరా తన మొదటి సినిమాలో విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నట్లు సమాచారం. ఆసక్తికర విషయం ఏమిటి అంటే..ఈ చిత్రానికి రిషి మనోజ్ దర్శకత్వం వహించనున్నాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
త్రివిక్రమ్ సహాయంతో రిషి మనోజ్ ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులపై పని చేశాడు. తన అనుభవాన్ని మరింత పెంచుకునేందుకు అతను ప్రస్తుతం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దగ్గర శిక్షణ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. స్పిరిట్ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా రిషి మనోజ్ పని చేయబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా కోసం కూడా రిషి పనిచేస్తున్నాడు.
ఇలా దర్శకత్వంలో ప్రావీణ్యం రాగానే.. త్రివిక్రమ్ రాసుకుంటున్న స్క్రిప్ట్ తో తన కొడుకుని దర్శకుడుగా పరిచయం చేయనున్నారని.. ఇక ఆ సినిమా ద్వారానే పవన్ కళ్యాణ్ కొడుకు కూడా ఎంట్రీ ఇబ్బందులు ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి.
అకీరా-రిషి మనోజ్ కాంబినేషన్‌లో రాబోయే చిత్రం సందీప్ రెడ్డి వంగా స్టైల్‌లో.. చాలా వైల్డ్‌గా ఉండబోతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్‌లో స్టార్ వారసుల సినిమా ఎలా ఉండబోతుందో సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Koneru Konappa: రేవంత్ రెడ్డికి ఊహించని దెబ్బ.. కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా
Also Read: KCR Meeting: గాయాల నుంచి కోలుకుని పుంజుకోవాలి.. గులాబీ శ్రేణులకు మాజీ సీఎం కేసీఆర్ పిలుపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.