Karnataka govt ban on chikkis distribution in schools: సాధారణంగా సర్కారు బడుల్లో చదువుకునే పిల్లల కోసం అనేక రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజనం పథకంను అమలు చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో వీటి పేర్లు ఏవిధంగా ఉన్న... మోటో మాత్రం.. పిల్లలకు మంచి రుచికరమైన, పౌష్టికమైన ఆహారంను అందించడం. ఇదిలా ఉండగా..ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకం సమర్థవంతంగా అమలు చేస్తుంది.
అయితే.. కొంత మంది మధ్యాహ్న భోజనంలో అందించే గుడ్లను తినరు . ఇలాంటి వారి కోసం ప్రభుత్వం చాలా ఏళ్ల నుంచి చిక్కి అందిస్తుంది. అయితే.. ఇటీవల చిక్కి తినడం వల్ల చాలా మంది ఆస్పత్రి పాలైనట్లు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అంతే కాకుండా.. తేదీలు అయిపోయిన తర్వాత పదార్థాలతో తయారు చేసిన చిక్కిలు తినడంవల్ల విద్యార్థులు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు.
ఈక్రమంలో ఇక నుంచి మధ్యాహ్న భోజనంంలో పిల్లలకు చిక్కీలు ఇవ్వొద్దని కూడా కర్ణాటక ప్రభుత్వం అన్ని పాఠాశాలకు ఆదేశించింది. అదే విధంగా చిక్కీలను లాబ్ కు తరలించగా.. దీనిలోహనీ కల్గించే పదార్థాలు ఉన్నయని టెస్టుల్లో బైటపడింది. చాలా కాలం పాటు నిల్వ ఉంచిన చీక్కిలను విద్యార్థులకు ఇస్తున్నట్లు విషయం వెలుగులోకి వచ్చింది.
దీంతో దీనిపై కర్ణాటక సర్కారు విచారణ చేపట్టి.. మొత్తంగా విద్యార్థుల అనారోగ్య సమస్యలకు కారణమవుతున్న చిక్కీలను ఇక మీదట పిల్లలకు సరఫరా చేయోద్దని కూడా కర్ణాటర ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు చిక్కీకి బదులుగా..అరటి పండ్లు ఇవ్వాలని కూడా కర్ణాటక సర్కారు విద్యాశాఖ అధికారుల్ని ఆదేశించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter