Air Asia Offer: మాన్‌సూన్ వెకేషన్ చాలా మంది ముందే ప్లాన్ చేస్తుంటారు. ఈసారి వేసవి తరువాత విదేశాలకు వెళ్లే ఆలోచన ఉంటే ఈ ఆఫర్ మీ కోసమే. బ్యాంకాక్, కౌలాలంపూర్‌లో మాన్‌సూన్ వెకేషన్ గడిపేందుకు అత్యంత చౌక ధరకే వెళ్లవచ్చు. ఎయిర్ ఏసియా ఆఫర్ వెంటే కళ్లు చెదిరిపోతాయి. ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంది, టికెట్ ధర ఎంతనే వివరాలు మీ కోసం.
మాన్‌సూన్ వెకేషన్ విదేశాలకు వెళ్లే ఆలోచన ఉంటే ఇప్పుడే మీ టికెట్ బుక్ చేసుకోండి. ప్రయాణం మీ ఇష్టం ఎప్పుడైనా చేయవచ్చు. ముఖ్యంగా బ్యాంకాక్, కౌలాలంపూర్ దేశాలకు కేవలం 5 వేలకే వెళ్లవచ్చు. ఎయిర్ ఏసియా ఈ ప్రత్యేకమైన ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రకారం విశాఖపట్నం నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్ ప్రాంతాలకు ఫ్లైట్ టికెట్ కేవలం 5 వేలకే లభించనుంది. 2025 జూలై 1 నుంచి 2026 జూన్ 15 వరకూ ప్రయాణించవచ్చు. జీరో బేస్ ఫేర్ పేరుతో ఎయిర్ ఆసియా ఈ ఆఫర్ ప్రకటించింది. విశాఖపట్నం నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్‌తో పాటు తిరుచినాపల్లి నుంచి బ్యాంకాక్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ కోసం టికెట్ల బుకింగ్ ఇప్పుడే చేసుకోవాలి. ఫిబ్రవరి 15 నుంచి బుకింగ్ ప్రారంభమైంది. 23వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. అంటే ఈ వారంలో టికెట్ బుక్ చేసుకుని జూలై నుంచి ఏడాది వ్యవధిలో ఎప్పుడైనా బ్యాంకాక్, కౌలాలంపూర్‌కు వెళ్లవచ్చు.
విశాఖపట్నం నుంచి బ్యాంకాక్ లేదా కౌలాలంపూర్‌కు టికెట్ సాధారణంగా 7500 రూపాయల నుంచి 12 వేల వరకు ఉంటుంది. కానీ ఈ ఆఫర్‌లో 4400 నుంచి 5 వేల మధ్యలో టికెట్ లభిస్తుంది. ఈ ఆఫర్ అన్ని కేటగిరీల ప్రయాణీకులకు వర్తిస్తుంది.
Also read: Kesineni Nani: కేశినేని నాని మళ్లీ రాజకీయాల్లో వస్తున్నారా, అసలేం జరుగుతోంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి