New Chief Election Commissioner: కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిగా దీర్ఘకాలం పనిచేసిన రాజీవ్ కుమార్ మరో రెండు రోజుల్లో అంటే ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్నారు. అంతకంటే ముందు కొత్త ఎన్నికల ఛీఫ్ ఎలక్షన్ కమీషనర్ ఎవరనేది ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీనికోసం కేరళ కేడర్ అధికారి పేరు తెరపైకి వచ్చింది.
భారతదేశ ఛీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్ ఈ నెల 18వ తేదీన రిటైర్ కానున్నారు. ఈయన హయాంలోనే అత్యధికంగా ఈవీఎం వివాదాలు వెలుగుచూశాయి. బహుశా అందుకే రాజీవ్ కుమార్‌ను బీజేపీ మనిషిగా ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. 2020 మే నెలలో ఛీఫ్ ఎలక్షన్ కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ కుమార్ దాదాపు ఐదేళ్లు పనిచేశారు. చాలామందితో పోలిస్తే సుదీర్ఘ కాలం పనిచేసినట్టే. ఇప్పుడు కొత్త ఎన్నికల అధికారి ఎవరనే ఆసక్తి నెలకొంది.కేరళ కేడర్ అధికారి పేరు పరిశీలనలో ఉంది.
భారతదేశ కొత్త ఛీఫ్ ఎలక్షన్ కమీషనర్‌గా కేరళ కేడర్‌కు చెందిన 1988 ఐఏఎస్ అధికారి జ్ఞానేశ్ కుమార్ పేరు విన్పిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘంలో రాజీవ్ కుమార్ తరువాత అత్యంత సీనియర్ అధికారి ఈయనే. ఈయన పదవీ కాలం మరో నాలుగేళ్లు ఉంటుంది. 2029 జనవరి 25 వరకూ జ్ఞానేశ్ కుమార్‌కు సర్వీస్ ఉంది. గతంలో ఈయన పార్లమెంటరీ వ్యవహారాల కార్యదర్శిగా పనిచేశారు. 2019 ఆర్టికల్ 370 రద్దు సమయంలో హోం మంత్విత్వ శాఖలో అదనపు కార్యర్శిగా ఉన్నారు.
Also read: Telangana DSC: డీఎస్సీ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్, 1382 మంది ఎస్జీటీలుగా నియామకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి