Acid Reduce Fruits: యాసిడ్స్ స్థాయిలను సహజంగా సమతులం చేసే 5 పండ్లు..

Acid Reduce Fruits: ఈ కాలంలో కడుపు సమస్యలు చాలా మందిని వేధిస్తాయి. ఇది ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఒక్కోసారి గుండెమంటకు దారితీస్తుంది. కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. అయితే, కొన్ని రకాల పండ్లు తీసుకోవడం వల్ల యాసిడ్‌ స్థాయిలు అదుపులో ఉంటాయి. అవి ఏంటో తెలుసుకుందాం..

Written by - Renuka Godugu | Last Updated : Feb 14, 2025, 04:40 PM IST
Acid Reduce Fruits: యాసిడ్స్ స్థాయిలను సహజంగా సమతులం చేసే 5 పండ్లు..

Acid Reduce Fruits: మన శరీరం పీహెచ్ స్థాయిలు సరైన స్థాయిలో నిర్వహించాలి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.. పీహెచ్‌ స్థాయిలు అసమతులంగా ఉంటే యాసిడ్ పెరిగిపోతుంది. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీని యాసిడ్ రీఫ్లెక్స్ అంటారు. ఇది ఒక్కోసారి కడుపులో అల్సర్‌కు కూడా కారణం అవుతుంది. శరీరంలో యాసిడ్స్ స్థాయిలను సమతులం చేసే కొన్ని రకాల పండ్లు ఉన్నాయి. వీటిని డైట్‌లో చేర్చుకోవడం వల్ల పుష్కల ప్రయోజనాలు కలుగుతాయి.. వీటివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

 ఇలాంటి పండ్లలో ఖనిజాలు పుష్కలంగా ఉండటంతో పాటు పీహెచ్ స్థాయిలను కూడా నిర్వహిస్తాయి. జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. ఆల్కలైన్ పుష్కలంగా ఉండే ఇలాంటి పనులు డైట్లో చేర్చుకోవడం వల్ల కడుపు ఆరోగ్యం బాగుంటుంది. అలాంటి ఐదు రకాల పండ్ల జాబితా తెలుసుకుందాం..

పుచ్చకాయ..
యాసిడ్ సమస్యతో బాధపడేవారు మిలన్ జాతికి చెందిన పండ్లను చేర్చుకోవాలి. అంటే పుచ్చకాయ, కర్బూజా వంటివి తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి మేలుకు జరుగుతుంది. ఇందులో ఆల్కలైన్ ఉంటుంది. కాబట్టి ఇవి శరీరానికి మేలు చేస్తాయి. కడుపులో యాసిడ్‌ని సమతులం చేస్తాయి. నీటి శాతం అధికంగా ఉండటం వల్ల కడుపులో యాసిడ్స్ స్థాయిలను తగ్గించి హైడ్రేషన్ అందించేలా ప్రేరేపిస్తాయి.

అరటిపండు..
అరటిపండు ఆల్కలైన్‌ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది మంచి సమతుల ఆహారం కడుపుకు హాయినిచ్చే పండు అని చెప్పాలి. ఇందులో పొటాషియం, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో మన శరీరానికి కావాల్సిన విటమిన్స్ ఉంటాయి.. ఇది జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది కడుపులో యాసిటీ స్థాయిలను సమతులం చేస్తుంది

యాపిల్స్..
యాపిల్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి కూడా జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాబట్టి ఇవి కడుపులో యాసిడ్‌ను గ్రహించేస్తాయి. అంతేకాదు ఇందులోని ఆల్కలైన్‌ కడుపులో యాసిడిటీని సమతులం చేస్తుంది. త్వరగా కడుపు సమస్యలకు మంచి రెమిడీ అవుతుంది. ఇది యాసిడ్ రిఫ్లెక్స్ సమస్యకు ఎఫెక్టీవ్‌ రెమిడీ.

ఇదీ చదవండి: ద్రాక్ష మీ బ్యూటీ రొటీన్‌లో ఉందా? మీకు నిత్యయవ్వనం.. మచ్చలేని అందం..

పీయర్‌ పండు..
పీయర్‌ పండు డైట్ లో చేర్చుకోవడం వల్ల కూడా ఇది కడుపు సమస్యకు మంచి పరిష్కారం. ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది కడుపులో యాసిడ్‌ని డైల్యూట్‌ చేస్తుంది. దీంతో జీర్ణ సమస్యలకు పరిష్కరిస్తుంది. పీయర్‌ పండ్లను జీర్ణ ఆరోగ్యానికి ఉత్తమ పండుగ పరిగణిస్తారు. ఇది పీహెచ్ స్థాయిలను ఆరోగ్యకరంగా నిర్వహిస్తాయి..

ఆవకాడో..
ఈ బట్టర్ ఫ్రూట్ అనే ఈ అవకాడోను కూడా డైట్లో చేర్చుకోవడం వల్ల ఇందులోని మోనో అన్‌శాచురేటెడ్‌ కొవ్వులు కడుపు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. అంతే కాదు కడుపులో ఉండే అధిక యాసిడ్‌ని కూడా నివారిస్తుంది. ఆవకాడో అందానికి కూడా మేలు చేస్తుంది. దీంతో కొల్లాజెన్‌ ఉత్పత్తి పెరుగుతుంది.

ఇదీ చదవండి: పీఎం కిసాన్‌ యోజనలో రూ.2000 పొందేందుకు మీరు అర్హులా? ఎలిజిబిలిటీ చెక్‌ చేయండి..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News