Grapes: ద్రాక్ష మీ బ్యూటీ రొటీన్‌లో ఉందా? మీకు నిత్యయవ్వనం.. మచ్చలేని అందం..

Grapes beauty Benefits: ద్రాక్ష పండ్లు రుచికరంగా ఉంటాయి. ఇది మంచి స్నాక్ అవుతుంది.. ద్రాక్ష పండులో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు.. ద్రాక్షతో అందానికి కూడా మేలు. ఈ సూపర్ ఫుడ్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అందానికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది తెలుసుకుందాం..

Written by - Renuka Godugu | Last Updated : Feb 14, 2025, 09:59 AM IST
Grapes: ద్రాక్ష మీ బ్యూటీ రొటీన్‌లో ఉందా? మీకు నిత్యయవ్వనం.. మచ్చలేని అందం..

Grapes beauty Benefits: ద్రాక్ష పండ్లను సీజన్‌లలో మార్కెట్లో విక్రయిస్తారు. ఇవి మూడు రంగుల్లో అందుబాటులో ఉంటాయి. నలుపు, ఎరుపు, ఆకుపచ్చ ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల యాంటీ ఎజింగ్ గుణాలు కనిపిస్తాయి. ఇది హానికర సూర్యకిరణాల నుంచి కూడా మన చర్మాన్ని రక్షిస్తుంది.. ముఖ్యంగా ఇది కొల్లాజెన్‌ ఉత్పత్తికి బూస్టింగ్ ఇస్తుంది. డైలీ మన స్కిన్ కేర్ రొటీన్ లో భాగంగా గ్రేప్స్ ని చేర్చుకుంటే కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..

ద్రాక్ష పండ్లను స్కిన్ కేర్ రొటీన్ లో చేర్చుకోవడం వల్ల హానికర యూవీ కిరణాల నుంచి మనల్ని రక్షిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన చర్మంపై సన్‌స్క్రీన్‌కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఎండ నుంచి రక్షించి ముఖ ట్యాన్‌ కాకుండా కాపాడుతుంది. ముఖానికి షీల్డ్ గా రక్షిస్తుంది. స్కిన్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది ఎండాకాలంలో ద్రాక్షలను కచ్చితంగా డైట్లో చేర్చుకోవాలి

అంతేకాదు త్వరగా వృద్ధాప్య ఛాయలు కూడా కనిపించవు. ద్రాక్ష పండ్లను తీసుకోవడం వల్ల అందులోని  యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్ సమస్య నుంచి తగ్గిస్తాయి. ముఖంపై మచ్చలు, గీతలు రాకుండా నివారిస్తుందని కొన్ని నివేదికలు తెలిపాయి.. కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. దీంతో స్కిన్ సాగే గుణం కూడా పొందుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ చర్మం యవ్వనంగా కనిపించేలా ప్రేరేపిస్తుంది.

 ద్రాక్ష పండ్లను తీసుకోవడం వల్ల మన చర్మానికి హైడ్రేషన్ కూడా అందుతుంది. ఇందులో నీటి శాతం అధిక మోతాదులో ఉండటం వల్ల మీ ముఖం మృదువుగా మారుతుంది.. పొడిబారే సమస్య దరిచేరకుండా ఉంటుంది.. నేచురల్ గా మాయిశ్చర్ గుణాలు కలిగి ఉంటుంది ద్రాక్ష.

 ద్రాక్ష పండ్లను తరచూ తీసుకోవడం వల్ల ఇది హైపర్ పిగ్మెంటేషన్ సమస్యను తగ్గిస్తుంది. ముఖ్యంగా ఇది నల్ల మచ్చలను తగ్గిస్తుంది. దీంతో మీ స్కిన్ టోన్ మెరుగవుతుంది. ఈవెన్‌ స్కిన్ టోన్ మీ సొంతమవుతుంది. చూడటానికి కూడా మెరుస్తూ ఆరోగ్యంగా కనిపిస్తుంది..

ఇదీ చదవండి: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌.. పర్యాటక శాఖ ద్వారా శ్రీవారి దర్శనాలు..  

 ద్రాక్ష పళ్ళు మన డైట్ లో ఉంటే కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. దీంతో చర్మానికి పునరుజ్జీవనం అందిస్తుందని కొన్ని నివేదికలు తెలిపాయి. ద్రాక్షలో కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడే గుణాలు ఉంటాయి.

అంతేకాదు ద్రాక్షను బ్యూటీ రొటీన్ లో చేర్చుకోవడం వల్ల ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. దీంతో మీ స్కిన్ పై యాక్నే రాకుండా నివారిస్తుంది. మచ్చలు, దురదలు నివారిస్తుంది. ఓపెన్ ఫోర్ సమస్య కూడా ఎఫెక్ట్ రెమిడి.

ద్రాక్ష పండుతో మనము ఫేస్ కి స్క్రబ్ కూడా తయారు చేసుకోవచ్చు. ద్రాక్ష పండును క్రష్ చేసి ఇందులో తేనె, ఆలివ్‌ ఆయిల్ వేసి స్క్రబ్ తయారు చేసుకుని దీన్ని కొన్ని నిమిషాల పాటు ముఖంపై సర్కులర్ మోషన్ లో రుద్దాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. అంతేకాదు ఈ ద్రాక్ష పండ్లతో యోగార్ట్‌ కలిపి ఫేస్ మాస్క్‌ కూడా తయారు చేసుకుంటారు. ఈ రెండిటిని సమపాళ్లలో కలిపి ఓ అరగంట పాటు ముఖానికి అప్లై చేసి ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. 

ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..

అంతేకాదు ఈ ద్రాక్షతో జ్యూస్ టోనర్ కూడా తయారు చేసుకుంటారు. ముందుగా ద్రాక్షలను బ్లెండ్ చేసుకుని ఆ తర్వాత వడకట్టుకోవాలి. కాటన్ ప్యాడ్‌తో ముఖానికి క్లెన్స్‌ చేసుకోవాలి. ఇలా కొన్ని నిమిషాలు పాటు చేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుని మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News