Black Hair: బామ్మ చెప్పిన సీక్రెట్‌.. ఇలా చేస్తే జుట్టు వేగంగా, ఒత్తుగా పెరుగుతుంది..!

Long And Black Hair Hacks: ఈ రోజుల్లో 30 ఏళ్ల వయసు వచ్చే లోగానే తెల్ల వెంట్రుకల సమస్య పెరిగింది. ఇది చూడటానికి అంద విహీనంగా కనిపించేలా చేస్తుంది.. అయితే దీనికి ఎక్కువ కెమికల్స్ ఉన్న కలర్స్ వాడతారు. కానీ సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి. ఇంట్లోనే నేచురల్ గా తెల్ల జుట్టును నల్లగా మందపాటి జుట్టు పెరగాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి.

Written by - Renuka Godugu | Last Updated : Feb 13, 2025, 06:44 PM IST
Black Hair: బామ్మ చెప్పిన సీక్రెట్‌.. ఇలా చేస్తే జుట్టు వేగంగా, ఒత్తుగా పెరుగుతుంది..!

Long And Black Hair Hacks:  ఈ కాలంలో వైట్ హెయిర్ జుట్టు రాలే సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. ముఖ్యంగా వైట్ హెయిర్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇంట్లో ఉండే కొన్ని చిట్కాలతో ఈ వైట్‌ హెయిర్‌ సమస్యకు రెమిడీ సౌందర్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కెమికల్స్ ఉండే ఉత్పత్తుల కంటే ఇలాంటివి ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి..

కరివేపాకు ఆయిల్..
కూరల్లో వినియోగించే కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇది మేలనీన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది.. అందుకే వైట్ హెయిర్ సమస్యతో బాధపడుతున్న వారికి కరివేపాకు ఎఫెక్టీవ్‌ రెమిడీ. ఇందులో ప్రోటీన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ కరివేపాకు నూనెను ఇంట్లోనే తయారు చేసుకొని జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కొబ్బరి నూనెలో కరివేపాకు ఆకులు వేసి పేస్ట్ మాదిరి చేసుకొని ఉడికించి జుట్టుకు అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు సమస్యకు చక్కని రెమిడీ.

బ్లాక్ టీ..
బ్లాక్ టీలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కెఫీన్‌ జుట్టును సహజ సిద్ధంగా నలుపు రంగులోకి మారుస్తుంది. టీ పొడి ఉడికించుకొని హెయిర్ వాష్ చేయడం వల్ల నల్ల జుట్టు మందంగా పెరుగుతుంది. జుట్టుకు కాఫీ అప్లై చేయడం వల్ల కూడా తెల్ల జుట్టు సమస్యకు చక్కని రెమిడీ. కొద్ది రోజుల్లోనే నల్లని ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది.

ఉసిరి పొడి..
ఉసిరి పొడి కూడా తెల్ల జుట్టు సమస్యకు మంచి పరిష్కారం. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. పిగ్మెంటేషన్ జుట్టు పై ప్రేరేపిస్తుంది. త్వరగా తెల్ల వెంట్రుకలు రాకుండా నివారిస్తుంది .. కొబ్బరి నూనె ఉసిరి పొడి కలిపి జుట్టుకు అప్లై చేయడం వల్ల తెల్లజుట్టు సమస్య త్వరలోనే తగ్గిపోతుంది.

ఉల్లిపాయ రసం..
ఉల్లిపాయ రసంలో క్యాటలిజ్ ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి తెల్ల వెంట్రుకల పెరుగుదలను నివారిస్తాయి. ఉల్లిపాయ నుంచి రసం తీసి దీనిని ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్స్ లో ఉపయోగించి జుట్టు అంతటికీ అప్లై చేయాలి. అరగంట తర్వాత సాధారణ నీటితో హెయిర్ వాష్‌ చేసుకోవటం వల్ల తెల్లజుట్టు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కనీసం వారంలో ఒకసారైనా ఈ రెమెడీ ట్రై చేయండి.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..

హెన్నా హెయిర్ మాస్క్‌..
హెన్నా హెయిర్ మాస్క్ ఇది నేచురల్ గా జుట్టుకు మంచి పోషణ అందిస్తుంది. జుట్టు ఆరోగ్యకరంగా మెరిసేలా ప్రేరేపిస్తుంది. దీంతో జుట్టు బలంగా.. పొడుగ్గా కోరుకుంటుంది. ఈ మ్యాజికల్ మాస్క్‌ అప్లై చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మంచి ఫలితాలు లభిస్తాయి.. హెన్నాలో నిమ్మరసం, గుడ్డు వేసి జుట్టు అంతటికీ పట్టించాలి. ఆరిన తర్వాత తలస్నానం చేయడం వల్ల తెల్ల జుట్టు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. జుట్టు ఒత్తుగా ..పొడుగ్గా పెరుగుతుంది.

ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?

తెల్ల జుట్టు రావడానికి ప్రధాన కారణం వయసురీత్యా వస్తుంది లేదా జెనెటిక్స్, వాతావరణ మార్పులు, సైకలాజికల్ వల్ల ఇలా జరుగుతుంది.. వయసు పెరుగుతున్న కొద్దీ మెలోసేనోసైట్స్ యాక్టివిటీ తగ్గిపోతుంది. దీంతో మెలనీన్‌ ఉత్పత్తి కూడా తగ్గిపోవడం వల్ల తెల్ల జుట్టు పెరుగుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News