Chia Seed Oil For Rapid Hair Growth: చియా విత్తనాలతో తయారుచేసిన నూనె జుట్టుకు అప్లై చేయడం వల్ల ఆరోగ్యంగా పెరుగుతుంది.. హెయిర్ ఫాలికల్స్ డ్యామేజ్ కాకుండా ఉంటాయి. ఇది ఒక మ్యాజికల్ ఆయిల్ అని చెప్పవచ్చు. ఈ ఆయిల్ జుట్టుకు అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
బలమైన జుట్టు..
చియా విత్తనాలతో తయారు చేసిన ఆయిల్ జుట్టుకు అప్లై చేయడం వల్ల మన జుట్టుకు కావాల్సిన బలం అందుతుంది. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. పాడైన హెయిర్ ని కూడా రిపేరు చేస్తుంది. చియా విత్తనాలను తయారు చేసిన నూనెతో హెయిర్ ఫాలికల్ బలంగా మారుతుంది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్..
చియా విత్తనాలు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. జుట్టుకి మంచి పోషణ అందిస్తాయి. కుదుళ్లకు హైడ్రేషన్ అందిస్తుంది. హెయిర్ ఫాలికల్ డామేజ్ కాకుండా ఉంటుంది. దీంతో జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.. రక్త సరఫరా మెరుగుగా మారి జుట్టు బలంగా మందంగా పెరుగుతుంది.
కుదుళ్లకు మాయిశ్చర్..
చియా విత్తనాలతో తయారు చేసిన నూనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల స్కాల్ప్ మంచి పోషణ అందిస్తుంది. ఇది మాయిశ్చర్‌ను నిలుపుతుంది.. దీంతో జుట్టుకు హైడ్రేషన్ అందిస్తుంది. మాయిశ్చర్ పోగొట్టుకోకుండా ఉండటం వల్ల చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుంది. దీంతో హెయిర్ ఫాల్ సమస్యకు ఎఫెక్టీవ్ రెమిడీ.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం..
చియా విత్తనాల నూనెను యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్ డామేజ్ కాకుండా నివారిస్తుంది.. దీంతో జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను నివారిస్తుంది. జుట్టును బలంగా మార్చి త్వరగా తెల్ల వెంట్రుకల సమస్య రాకుండా నివారించి.. హెయిర్ ఫాల్ సమస్యకు చక్కని రెమిడి అవుతుంది.
కుదుళ్ల ఆరోగ్యం..
చియా విత్తనాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దీంతో జుట్టు పై వచ్చే దురదకు తగ్గిస్తుంది. ఇది కుదుళ్ల ఆరోగ్యానికి ప్రేరేపిస్తుంది. ఇందులో ఇన్ఫ్లమేషన్ గుణాలు ఉంటాయి.
చియా విత్తనాలతో తయారుచేసిన నూనె జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఇందులోని ఖనిజాలు హెయిర్ ఫాలికల్స్ ను బలంగా మారుస్తాయి.. చియా విత్తనాల్లో తలపై పేరుకున్న అదనపు నూనెను గ్రహిస్తుంది. దీంతో హెయిర్ ఫాలికల్స్ ఆరోగ్యంగా మారుతాయి.
ఇదీ చదవండి: కొబ్బరినూనె వాడే సరైన పద్ధతి చాలామందికి తెలియదు.. ఇలా వాడితే మీ జుట్టు నేల తాకాల్సిందే..
చియా విత్తనాలతో తయారుచేసిన నూనెలో చేర్చుకోవడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి.. దీన్ని నేరుగా జుట్టుకు అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. దీంతో బ్లడ్ సర్కులేషన్ మెరుగవుతుంది. కొన్ని చుక్కల చియా సీడ్ ఆయిల్ జుట్టు అంతటికీ అప్లై చేసి ఓ పది నిమిషాల పాటు హెడ్ మసాజ్ చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి. దీంతో మీ జుట్టు మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటుంది.
చియా విత్తనాలతో హెయిర్ మాస్క్ కూడా అప్లై చేయవచ్చు. మంచి పోషణ అందిస్తుంది. డ్యామేజ్ అయిన జుట్టుని రిపేర్ చేసే గుణం ఇందులో ఉంటుంది. రెండు టేబుల్ స్పూన్ చియా సీడ్స్ ఆయిల్లో తేనె కలిపి తలంతటికీ అప్లై చేయడం వల్ల ఇది మంచి హైడ్రేషన్ మాస్క్ అవుతుంది. దీంతో జుట్టు కుదుళ్ల నుంచి అప్లై చేయాలి. సాధారణ నీటితో షాంపు ఉపయోగించి తలస్నానం చేసుకోవాలి.
ఇదీ చదవండి: జంక్ ఫుడ్ బదులు.. గుప్పెడు సన్‌ఫ్లవర్ సీడ్స్ తింటే మీ గుండె గట్టిదవుతుంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి