Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఇవాళ అతి పెద్ద ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నదీ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించింది. దేశంలో అతి పెద్ద ఎన్‌కౌంటర్‌గా పోలీసులు భావిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా అడవులు ఇవాళ కాల్పులతో మార్మోగిపోయాయి. ఇవాళ ఉదయం నుంచి పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు భీకరంగా జరిగాయి. బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నదీ ప్రాంతంలోని అడవుల్లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి జవాన్లకు గాయాలు కాగా చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. మావోయిస్టులతో జరిగిన కాల్పుల్లో డీఆర్‌జి అండ్ ఎస్టీఎఫ్ బస్తర్ ఫైటర్లు పాల్గొన్నారు.
ఎన్‌కౌంటర్ స్థలం నుంచి పెద్దమొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్ధాలు, ఏకే 47, ఎస్ఎల్ఆర్, ఇస్తాఫ్ రైఫిల్, 303 బీపీఎల్ లాంచర్ స్వాధీనమయ్యాయి. ఇంద్రావతి నదీ ప్రాంతంలోని అడవుల్లో భద్రతా బలగాలు ఇంకా జల్లెడపడుతున్నాయి. ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్‌లో పార్టీ అగ్రనేతలు ఉన్నట్టు సమాచారం. ఈ ఏడాదిలో జరిగిన వరుస ఎన్‌కౌంటర్లలో 100 మంది వరకు మరణించారు. గత నెలలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 48 మంది మావోయిస్టులు మృతి చెందారు. అంతకుముందు ఛత్తీస్‌గఢ్ - ఒరిస్సా సరిహద్దులోని గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు హతమయ్యారు.
Also read: Ys Jagan Strategy: షర్మిలకు జగన్ షాక్, త్వరలో పార్టీలో మరో ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నేతలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి