NEET UG 2025: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నీట్ యూజీ 2025 పరీక్షకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 7 శుక్రవారం నుంచి ప్రారంభమైంది. మార్చ్ 7వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ కొనసాగనుంది.https://neet.nta.in/
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, డెంటల్, ఇతర వైద్య విద్యల అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశం కోసం నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ జరుగుతుంటుంది. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఈ ఏడాది అంటే నీట్ యూజీ 2025 నోటిఫికేషన్ నిన్న వెలువడింది. నీట్ పరీక్షలు సిద్ధమయ్యే విద్యార్ధులకు నిన్నటి నుంచే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మార్చ్ 7 వరకూ ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ https://neet.nta.in/ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మార్చ్ 7వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు అవకాశముంటుంది. మార్చ్ 9 నుంచి 11 వరకూ తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకోవచ్చు.
నీట్ యూజీ 2025 పరీక్షకు జనరల్ కేటగరీ విద్యార్ధులు 1700 రూపాయలు ఫీజు చెల్లించాలి. అదే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ విద్యార్ధులు 1600 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, ధర్డ్ జెండర్ విద్యార్ధులయితే 1000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దేశం వెలుపల ఉండే విద్యార్ధులయితే 9500 రూపాయలు ఫీజు చెల్లించాలి.
నీట్ పరీక్ష, ఫలితాలు ఎప్పుడు
నీట్ యూజీ 2025 పరీక్ష మే 4వ తేదీ మద్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకూ జరగనుంది. మొత్తం 13 భాషల్లో ఈ పరీక్ష ఉంటుంది. ఏప్రిల్ 26వ తేదీన పరీక్ష కేంద్రాలు ప్రకటించనున్నారు. మే 1వ తేదీన అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంటాయి. జూన్ 14వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు. గత ఏడాది దేశవ్యాప్తంగా 23.33 లక్షల మంది నీట్ పరీక్షల రాయగా ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరగనుందని అంచనా. గత ఏడాది దేశవ్యాప్తంగా 13.15 లక్షలమంది నీట్ అర్హత సాధించారు. ఏపీ నుంచి 64,929 మంది పరీక్ష రాయగా అందులో 43,788 మంది ఉత్తీర్ణులయ్యారు.
నీట్ యూజీ 2025 రిజిస్ట్రేషన్ చివరి తేదీ మార్చ్ 7
నీట్ యూజీ రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ మార్చ్ 9 నుంచి మార్చ్ 11
నీట్ యూజీ పరీక్ష కేంద్రాల ప్రకటన ఏప్రిల్ 26
నీట్ యూజీ అడ్మిట్ కార్డులు మే 1
నీట్ యూజీ 2025 పరీక్ష మే 4 మద్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు
నీట్ యూజీ 2025 పరీక్ష ఫలితాలు జూన్ 14
Also read: AP Liquor Prices: మందు బాబులకు షాక్, ఏపీలో భారీగా పెరగనున్న మద్యం ధరలు ఎప్పటి నుంచంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి