VRA Dharna: రోడ్డెక్కిన వీఆర్ఏలు.. మాజీ సర్పంచ్ లు టెన్షన్.. టెన్షన్..

VRA Dharna: హైదరాబాద్‌లో VRA లు, మాజీ సర్పంచ్‌లు రోడ్డెక్కారు. మినిస్టర్స్ క్వార్టర్స్‌ను  ముట్టడించేందుకు వీఆర్‌ఏలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 5, 2025, 07:45 PM IST
VRA Dharna: రోడ్డెక్కిన వీఆర్ఏలు.. మాజీ సర్పంచ్ లు టెన్షన్.. టెన్షన్..

VRA Dharna: తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మరోసారి ఉద్రిక్తతలు వేదికగా నిలిచింది.  హైదరాబాద్ వీఆర్ఏ, మాజీ సర్పంచ్ లు రోడ్డెక్కారు.  దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 3,797 మంది వీఆర్ఏలను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డు పై భైఠాయించారు.

గత 15 నెలలుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై నిరసనకు దిగారు. తమ డిమాండ్ల సాధన కోసం మంత్రిని కలవడానికి అనుమతి ఇవ్వడం లేదంటూ రోడ్డుపై బైఠాయించారు వీఆర్ఏలు. దీంతో మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర పరిస్థితి ఉద్రిక్తత నెలకొంది.

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

అయినప్పటికీ… మినిస్టర్ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు వీఆర్ఏలు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తంగా పరిస్థితి మారింది. మరోవైపు సచివాలయం ముట్టడికి మాజీ సర్పంచులు పిలుపు ఇచ్చారు. పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో సచివాలయ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. సచివాలయం దగ్గరకు వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలిస్తున్నారు.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News