Papaya: బొప్పాయిని పొరపాటున ఈ 4 ఆహార పదార్థాలతో తినకూడదు తెలుసా?

Never Combine with Papaya: బొప్పాయిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ సి, ఫోలేట్, విటమిన్ ఏ, ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్, మెగ్నీషియం ఉంటాయి.. జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందుకే బొప్పాయిని డైట్ లో చేర్చుకోమని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తారు. 

Written by - Renuka Godugu | Last Updated : Feb 3, 2025, 08:41 PM IST
Papaya: బొప్పాయిని పొరపాటున ఈ 4 ఆహార పదార్థాలతో తినకూడదు తెలుసా?

Never Combine with Papaya: బొప్పాయితో తినకూడని నాలుగు పదార్థాలు ఉన్నాయి.  పొరపాటున వీటిని డైట్ లో చేర్చుకోకూడదు. సాధారణంగా బొప్పాయి పండు తీసుకుంటే జీర్ణ ఆరోగ్యం మేలు జరుగుతుందని తింటారు.. ఇందులో యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యం కంటి ఆరోగ్యం అంతేకాదు జుట్టు ఎముకలు కూడా ఆరోగ్యం కలుగుతుంది. అయితే బొప్పాయితో పొరపాటున తినకూడని ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం..

 టి.. 
బొప్పాయి పండు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకునేవారు పొరపాటున కూడా టీతో పాటు తీసుకోకూడదు. ఎక్కువ శాతం మంది ఉదయం బ్రేకఫాస్ట్ లో టీ తీసుకుంటారు. అయితే బొప్పాయి పండుతో పొరపాటున తీసుకోవడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. టీలో కెటాచిన్‌ ఉంటుంది. ఇది ఈ పండుతో కలిపి తీసుకోవడం వల్ల రియాక్షన్ జరుగుతుంది. దీంతో కడుపులో అజీర్తి గ్యాస్ ఉండే మంట సమస్యలు వస్తాయి

గుడ్లు..
బొప్పాయిని గుడ్లతో పాటు కలిపి తీసుకోకూడదు. అంతేకాదు గుడ్లను ఏ పండ్లతో కలిపి తీసుకోకపోవడమే మంచిది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ కూడా ఉంటాయి. ఇక బొప్పాయిలో పప్పైన్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. ఈ రెండిటిని కలిపి తీసుకోవటం వల్ల అజీర్తి, వికారం, మలబద్ధకం, వాంతులు వంటివి జరగవచ్చు.

సిట్రస్ పండ్లు..
సిట్రస్‌ పండ్లను డైట్ లో చేర్చుకునే వాళ్లు ఉన్నారు. అయితే బొప్పాయితో కలిపి సిట్రస్ పండ్లను ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. ఇందులో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి.. కానీ ఈ రెండిటిని కలిపి తీసుకోవటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు ముఖ్యంగా నిమ్మకాయ, ఆరెంజ్, గ్రేప్ పండ్లతో పాటు బొప్పాయి కలిపి తీసుకోకూడదు. విటమిన్ సి పండ్లు సీట్రస్ పండ్లు. ఇది యాసిడ్ రియాక్షన్ కలిగి ఉంటాయి. బొప్పాయితో కలిపి తీసుకున్నప్పుడు యాసిడ్ రీఫ్లక్స్‌, గుండె మంట సమస్య వస్తుంది. 

ఇదీ చదవండి:  చెడు కొలెస్ట్రాల్ తగ్గించే చిన్ని చిట్కా.. హార్ట్ ఎటాక్ అడ్రస్ లేకుండా పోతుంది..

పాలు..
కొంతమంది బొప్పాయిని సలాడ్ రూపంలో తీసుకుంటారు. మరి కొంతమంది స్మూథీ లాగా కూడా తింటారు. అయితే పాలతో కలిపి బొప్పాయిని తినకూడదు. ఇందులో పాలు వేసి స్మూథీ రూపంలో తీసుకుంటారు. బొప్పాయిలోని పప్పైన్ పాలతో కలిసినప్పుడు జీర్ణ ఆరోగ్యం దెబ్బతింటుంది. దీంతో డయేరియా, గుండె మంట, మలబద్ధకం సమస్య కూడా రావచ్చు. పాలు తీసుకున్న ఓ గంట తర్వాత బొప్పాయి తినాలి.

బొప్పాయి పండు తినడం వల్ల మహిళల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వీటిని సలాడ్‌ లేదా స్మూథీ రూపంలో కూడా తింటారు. బొప్పాయిని నేరుగా కూడా తినవచ్చు.

ఇదీ చదవండి:  జియో బంపర్‌ బొనాంజా ప్లాన్‌.. బడ్జెట్‌లో 2 జీబీ డైలీ డేటా, 13 ఓటీటీలు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News