National Pension Scheme : భారతదేశంలో నేషనల్ పెన్షన్ స్కీమ్ చాలా మంది స్కీమ్. ఇది మంచి పెట్టుబడి మార్గంగాను..రిటైర్మెంట్ తర్వాత ప్రణాళికగానూ ఉంటుంది. ఈ స్కీము వల్ల మంచి ఆదాయం మాత్రమే కాదు..పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయి. అయితే 60 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత లేదా పదవీ విరమణ తరువాత ఎన్ పీఎస్ స్కీమ్ ద్వారా పొందిన ఆదాయంలో కనీసం 40 శాతాన్ని యాన్యుటీలోకి మార్చాలి. దీంతో సదరు వ్యక్తికి జీవితాంతం పెన్షన్ రూపంలో ఆదాయం వస్తుంది. మిగిలిన 60శాతం ఏక మొత్తాంగా విత్ డ్రా చేసుకోవచ్చు. అందుకే ఈ స్కీం గురించి ఒక చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం.
నెలవారీ రూ.1.5 లక్షల పెన్షన్ పొందడానికి, మీరు ప్రతి నెలా రూ.7,000 పెట్టుబడి పెట్టాలి. NPS దాదాపు 12 శాతం వార్షిక రాబడిని ఇస్తుంది. మీరు 25 సంవత్సరాల పాటు నిరంతరంగా రూ.7,000 ఇన్వెస్ట్ చేస్తే, 25 ఏళ్ల తర్వాత మీరు మొత్తం రూ.29,40,000 ఇన్వెస్ట్ చేసినట్లవుతుంది. ఈ పెట్టుబడికి 12 శాతం రాబడి కలిపితే దాదాపు రూ.4.54 కోట్ల నిధి సమకూరుతుంది. ఈ ఫండ్‌లో 40 శాతం యాన్యుటీని కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు. మిగిలిన 60 శాతం ఫండ్‌ను ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు. యాన్యుటీని కొనుగోలు చేసిన తర్వాత, మీరు ప్రతి నెలా దాదాపు రూ. 1.5 లక్షల పెన్షన్ పొందుతారు.
Also Read:Gold Rates: మహిళామణులూ..బంగారం ధర మళ్లీ తగ్గింది..కొనేందుకు ఇదే మంచి సమయం..ఎంత తగ్గిందో తెలుసా?
NPS పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ద్వారా నిర్వహింస్తుంది. మీరు యాన్యుటీని కొనుగోలు చేయాలంటే ఎన్పీఎస్ ఫండ్‌లో 40 శాతం ఉపయోగించాలి. మీరు మిగిలిన 60 శాతం మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా మీరు చేసుకోవచ్చు. ఏకమొత్తం ఉపసంహరణ పూర్తిగా పన్ను రహితం.ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల పన్ను ప్రయోజనం కూడా లభిస్తుంది. ఇది కాకుండా, సెక్షన్ 80CCD (1B) కింద, మీరు రూ. 50,000 వరకు యాన్యువల్ ఇన్ కంపై ట్యాక్స్ మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు.
ఎన్పీఎస్ స్కీములో టైర్ 1, టైర్ 2 రెండు అకౌంట్స్ ఉంటాయి. వీటికి ఆదాయపన్ను నిబంధనల ప్రకారం ట్యాక్స్ ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఐటీ యాక్ట్ సెక్షన్ 80 సీసీఈ ప్రకారం ఎన్పీఎస్ టైర్ 1 ఖాతాదారులు తమ కంట్రీబ్యూషన్ పై రూ. 1.5 లక్షల వరకు ట్యాన్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఖాతాదారులు 60ఏళ్లు దాటిన తర్వాత లేదంటే రిటైర్మెంట్ తర్వాత ఎన్పీఎస్ కార్పస్ నుంచి 60 శాతాన్ని ఏకమొత్తంగా విత్ డ్రా చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. యాన్యుటీ కొనుగోలుకు ఉపయోగించే 40శాతం మొత్తంపై కూడా ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది అయితే యాన్యుటీ నుంచి వచ్చే ఆదాయంపై మాత్రం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.