Pineapple Health Benefits: పైనాపిల్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఇది మన జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది ఒక సూపర్ ఫుడ్ ఫైబర్, జీర్ణ ఎంజైమ్స్ పుష్కలంగా ఉంటాయి.. పైనాపిల్‌లో విటమిన్స్ పేగు పనితీరును మెరుగు చేస్తుంది. వీటిని తరచూ తీసుకోవడం వల్ల మన శరీరానికి ఐదు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇందులో సీజనల్ జబ్బులకు చెక్ పెట్టే గుణం ఉంటుంది. అంతేకాదు ఇందులో నీటి శాతం కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ డైట్‌లో పైనాపిల్ చేర్చుకోవాల్సిందే. పసుపు రంగులో కనిపించే ఈ పండు అత్యంత సువాసన భరితంగా కూడా ఉంటుంది. పైనాపిల్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
పైనాపిల్‌లో బ్రోమలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మేలు చేసి ప్రోటీన్స్ విడగొడుతుంది పైనాపిల్ తీసుకోవడం వల్ల కడుపులో అజీర్తి, జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. కడుపు సమస్యలను కూడా పైనాపిల్ తగ్గిస్తుంది.
పైనాపిల్లో డైటరీ ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. ఇందులో కరగని ఫైబర్ ఉంటుంది. జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పైనాపిల్ ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడి.. మలబద్దక సమస్య రాకుండా కడుపులో మంచి బ్యాక్టిరియా పెరిగేలా ప్రేరేపిస్తుంది. పైనాపిల్‌లో ఫైబర్ ఉండటం వల్ల కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయం పాటు కలిగిస్తుంది. దీంతో అతిగా తినకుండా ఉంటారు. కడుపులో అజీర్తి, గ్యాస్ సమస్యకు చెక్ పెడుతుంది.
అంతేకాదు పైనాపిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కడుపునకు సంబంధించిన సమస్యలకు చెక్ పెడతాయి. ఇందులో ఉండే మైక్రోబియమ్ కడుపులో గుడ్ బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుంది. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది.. అంతేకాదు పైనాపిల్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల సీజనల్ జబ్బులు మన దరిచేరకుండా ఉంటాయి.
పైనాపిల్‌లో నీటి శాతం కూడా అధికంగా ఉంటుంది. ఇది నాచురల్ డిటాక్సిఫైర్‌లా పనిచేసి మన శరీరంలో చెడు పదార్థాలను బయటికి ఫ్లష్ చేస్తుంది. ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్ రాకుండా నివారిస్తుంది. ఆక్సిడేటీవ్ స్ట్రెస్ తగ్గిస్తుంది. పైనాపిల్ మంచి డిటాక్సిఫయర్‌లా కూడా పనిచేస్తుంది.
విద్యార్థులకు బంపర్ గుడ్‌న్యూస్.. తెలంగాణలో రేపు అన్నీ స్కూళ్లు, కాలేజీలకు సెలవు..
పైనాపిల్ నేరుగా లేదా సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇందులో ప్రీ బయోటిక్ ఎఫెక్ట్, డిటాక్స్ గుణాలు, వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వారు తీసుకోవడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. పైనాపిల్ మంచి రుచికరమైన స్వీట్ రుచిలో ఉండే పండు. కాబట్టి కడుపు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అయితే, ఏ పండు అయినా అతిగా తినకుండా ఉండాలి. అది కాకుండా పైనాపిల్ కొంతమందికి పడదు, డాక్టర్ల సూచన మేరకు తీసుకోవాలి. డయాబెటీస్‌తో బాధపడేవారు పైనాపిల్ తినకూడదు. ఇది రక్తంలో చక్కెర స్థాయలను హఠాత్తుగా పెరుగుతాయి.
అరటిపండు ఈ మాస్క్‌తో అందరూ మీ వైపే చూస్తారు.. బ్యూటిఫుల్ స్కిన్ మీ సొంతం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.