Neem: వేపను ఇలా వాడితే జుట్టులో చుండ్రు రవ్వంత కూడా కనిపించదు..

Neem For Dandruff: జుట్టులో చుండ్రు పేరుకున్నప్పుడు తలంతా చికాకు అనిపిస్తుంది. చుండ్రంతా రాలిపోతూ ఉంటుంది.. అయితే జుట్టులో చుండ్రు పెరుకుపోవడం వల్ల జుట్టు రాలే సమస్య కూడా పెరిగిపోతుంది. ఎక్కువ గాఢతో ఉన్న షాంపులు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు.. వేపతో చుండ్రు సమస్యను ఎలా అధిగమించాలి తెలుసుకుందాం ..

Written by - Renuka Godugu | Last Updated : Feb 7, 2025, 08:40 AM IST
Neem: వేపను ఇలా వాడితే జుట్టులో చుండ్రు రవ్వంత కూడా కనిపించదు..

Neem For Dandruff: జుట్టులో చుండ్రు పేరుకున్నప్పుడు బాగా దురదగా అనిపిస్తుంది. పెచ్చులు పెచ్చులుగా ఉండే చుండ్రు చికాకును తెప్పిస్తుంది. యాంటీ డ్యాండ్రఫ్‌ షాంపులు వాడితే అధికంగా సైడ్ ఎఫెక్ట్స్ కలిగి ఉంటుంది. దీంతో మరింత సమస్య పెరిగిపోయి అవకాశం కూడా ఉంది.. అయితే గత కొన్ని ఏళ్లుగా మన  భారతీయ సాంప్రదాయంలో వేపను ఉపయోగిస్తున్నారు. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. దీంతో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు. జుట్టులో చుండ్రు తగ్గించుకోవడానికి వేపను ఎలా వాడాలి తెలుసుకుందాం ..

వేపాకును తీసుకువచ్చి కడిగి శుభ్రం చేసి దీని పేస్ట్ మాదిరి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక చుండ్రు ఉన్న ప్రాంతంలో ఈ వేపాకును నేరుగా అప్లై చేయాలి. జుట్టు అంతా అప్లై చేసిన తర్వాత ఓ అరగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో మీ సాధారణ షాంపుతో హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చుండ్రుకు చెక్ పెట్టొచ్చు. 

 చుండ్రు సమస్యకు వేపాకును నేరుగా కాకుండా నీళ్లలో వేసి కూడా తీసుకోవచ్చు. వేపాకులు తీసుకువచ్చి నీళ్లలో మరిగించాలి. ఈ నీరు సగం అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. ఆ నీటితో జుట్టును కడగాలి ఇలా చేయడం వల్ల కూడా చుండ్రు తగ్గిపోతుంది. కుదుళ్ల ఆరోగ్యంగా కూడా బాగు పడుతుంది. అయితే చుండ్రుకు తల స్నానం చేసిన తర్వాత చివరిగా ఈ వేప నీళ్లతో జుట్టును కడగాలి. జుట్టు అంతా స్ప్రే చేసుకోవాలి. 

 మార్కెట్లో వేపతో చేసిన నూనె కూడా అందుబాటులో ఉంటుంది. ఈ వేప నూనెను కొబ్బరి నూనెను మిక్స్ చేసి జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. ఇది కుదుళ్లకు మంచి పోషణ అందిస్తుంది. దురదను తగ్గిస్తుంది చుండ్రు సమస్యకు తగ్గిస్తుంది. ఈ నూనెను జుట్టుకు అప్లై చేసిన తర్వాత తలస్నానం చేయాల్సి ఉంటుంది. ఓ గంట తర్వాత తలస్నానం చేయాలి. జుట్టు కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది. 

ఇదీ చదవండి: సోనూసూద్‌కు అరెస్ట్‌ వారెంట్‌ జారీ.. అసలు కారణం ఇదే..  
 ఇది కాకుండా వేప పొడిని షాంపూలో వేసి కూడా అప్లై చేయవచ్చు. తలస్నానం చేసేటప్పుడు షాంపులో బాగా కలిపి జుట్టుకు పట్టించాలి. ఆ తర్వాత తలస్నానం చేయడం వల్ల కుదుళ్ల ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. వేపతో హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల కుదుళ్లకు మంచి హైడ్రేషన్ అందుతుంది. దీంతో జుట్టు పొడి బారకుండా ఉంటుంది. వేప పొడిని, వేప పేస్టు, పెరుగులో వేసి బాగా మిక్స్ చేయాలి. ఇందులో కలబంద కూడా వేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్‌ జుట్టు అంతటికీ పట్టించి తలస్నానం చేయటం వల్ల జుట్టుకు మంచి మాయిశ్చర్ అందించడంతోపాటు జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.. వేప వల్ల జుట్టుకు ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉండవు.

ఇదీ చదవండి: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వాట్సాప్‌లో ఇంటర్‌ హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News