Uttar Pradesh Kasganj Sub inspector drunken video: సమాజంలో పోలీసులకు ఎంతో గౌరవంగా చూస్తారు. పోలీసు, యూనీఫామ్ జాబ్ కొట్టాలని చాలా మంది యువత కలలు కంటారు. కానీ అతి కొద్ది మంది మాత్రమే తమ కలను నెరవేర్చుకుంటారు. కానీ కొంత మంది పోలీసులు ప్రవర్తించే తీరు వల్ల మొత్తం డిపార్ట్ మెంట్ కే చెడ్డపేరు వస్తుంది. అంతే కాకుండా.. డిపార్ట్ మెంట్ అంటే ప్రజలు చులకనగా చూస్తారు. ఏదైన సమస్య లేదా అన్యాయం జరిగితే ప్రతిఒక్కరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తారు. కానీ పోలీసులే ప్రజల ముందు నీచంగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో అనేకం వెలుగులోకి వస్తున్నాయి.
In #UttarPradesh's Kasganj, video of drunken inspector goes viral!!
Drama going on just 50 meters away from SP office, drunk inspector is ruining the dignity of uniform
Sitting in a public place, doing obscene acts with a woman, "Inspector took off his cap and said I am fake!!" pic.twitter.com/wKAFiXmhsi
— Siraj Noorani (@sirajnoorani) February 20, 2025
తాజాగా.. ఒక పోలీసు అధికారి మద్యం మత్తులో నడి రోడ్డు మీద భార్యతో రొమాన్స్ కు దిగాడు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఉత్తర ప్రదేశ్ లోని కాసర్ గంజ్ లో ఒక సబ్ ఇన్స్ పెక్టర్ మద్యం మత్తులో బస్ స్టాప్ లో కూర్చున్నాడు. అతడు పీకల దాక మద్యం తాగినట్లు ఉన్నాడు. అతడ్ని అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు భార్య ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో అతను మాత్రం.. ఆమెను హత్తుకుని, ముద్దులు పెట్టుకుంటూ రొమాన్స్ చేస్తున్నాడు.
నడి రోడ్డు మీద బస్టాండ్ లో ఉన్నానన్న సోయి కూడా అతనికి లేదు. అక్కడి నుంచి వెళ్తున్న కొంత మంది పోలీసు అధికారి ఘనకార్యంను తమ ఫోన్ లలో రికార్డు చేశారు. ఈ క్రమంలో సదరు అధికారి అక్కడి వాళ్లతో ఇష్టమున్నట్లు మాట్లాడాడు.
డ్యూటీలో ఉండి కూడా ఇలాంటి పనులేందని ప్రశ్నిస్తే రివర్స్ లో వారినే నోటికొచ్చినట్లు తిడుతున్నాడు. అతని టోపీ కూడా దూరంగా పడిపోయి ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై యూపీ పోలీసులు సీరియస్ అయ్యారు. తప్పతాగిన ఎస్సైను సస్పెండ్ చేస్తు ఆదేశాలు జారీ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు కూడా పోలీసు అధికారిపై మండిపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి