Delhi CM Rekha Gupta: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాబోయే ఢిల్లీ సీఎం పై పలు ఊహాగానాలు వెలుబడ్డాయి. అందరి కంటే ముందు న్యూ ఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింత్ కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు వినపడింది. ఆ తర్వాత విజేందర్ గుప్తా, మనోజ్ తివారీ,కైలాష్ గెహ్లాట్, ఢిల్లీ బీజేపీ ఛీప్ వీరేంద్ర సచ్ దేవా పేర్లతో పాటు ఎంపీలైన మనోజ్ తివారీ, బాన్సురీ స్వరాజ్, స్మృతి ఇరానీ పేర్లు వినపడ్డాయి. కానీ కేంద్రంలోని బీజేపీ పెద్దలైన నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా కలిసి .. ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తాను ఎన్నో వడపోతల తర్వాత ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
ఈ మేరకు బుధవారం జరిగిన బీజేఎల్పీ సమావేశంలో రేఖా గుప్తాను శాసనసభ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. పర్వేష్ వర్మకు ఉప ముఖ్యమంత్రిగా పదవి అప్పగించారు. షాలిమార్‌భాగ్ నుంచి రేఖా గుప్తా ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాలకు ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎంతో పాటు మరో ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, తోపాటు కేంద్ర మంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఎన్టీయే పాలక భాగస్వాములైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితిష్ కుమార్, చిరాగ్ పాశ్వాన్ వంటి నేతలు హాజరు కానున్నారు.
రేఖా గుప్తా ఢిల్లీకి నాల్గో మహిళా ముఖ్యమంత్రి.. ఈమె ఫస్ట్ టైమ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా సుష్మా స్వరాజ్ బీజేపీ తరుపున ముఖ్యమంత్రిగా అతి స్వల్ప కాలం పనిచేసారు. ఆ తర్వాత షీలా దీక్షిత్..కాంగ్రెస్ పార్టీ తరుపున 15 యేళ్ల సుదీర్ఘ కాలం సీఎంగా తనదైన ముద్రవేసారు. రీసెంట్ గా ఆతీశీ మార్లెనా (ఆప్) తరుపున ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దేశంలో ఈమె 18వ మహిళా ముఖ్యమంత్రి..
బీజేపీ తరుపున గతంలో సుష్మా స్వరాజ్, వసుంధరా రాజే, ఉమా భారతి, ఆనందీ బెన్ పటేల్ వంటి వారు ముఖ్యమంత్రులుగా పనిచేసారు.ఇక లోక్ సభ స్పీకర్ గా సుమిత్రా మహాజన్.. భారత రాష్ట్రపతిగా.. ద్రౌపది ముర్ము.. మొత్తంగా దేశంలో ఓ స్ట్రాటజీ ప్రకారం మహిళా సాధికారికతకు పెద్ద పీఠ వేస్తోంది. మరోవైపు చట్ట సభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్స్ ఇచ్చిన ఘనత కూడా నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపికి దక్కుతుందనే చెప్పింది. దేశంలో మమత బెనర్జీ తర్వాత రెండో మహిళా ముఖ్యమంత్రి ఈమెనే కావడం గమనార్హం. అంతేకాదు ఢిల్లీలో మహిళా ముఖ్యమంత్రి తర్వాత మరోసారి ఓ మహిళనే సీఎం కావడం గమనార్హం.
రేఖా గుప్తా ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ABVP లీడర్ గా పనిచేసారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఏబీవీపీ జెండా ఎగరేయడంతో పాటు జాతీయ భావాలు పెంపొందించేలా ఈమె చేసిన కృషిని మరవలేనిది. రెండు సార్లు ఢిల్లీ మున్సిపల్ కౌన్సిలర్ గా పని చేశారు. లా పట్టభద్రురాలు. ప్రస్తుతం బీజేపీ తరుపున ఏ మహిళా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా లేరు. 2023లో రాజస్థాన్ లో వసుంధరా రాజే ప్లేస్ లో భజన్ లాల్ శర్మను ఎంపిక చేసింది. అప్పట్లో రాజేకు మోడీ, షాలతో అంతగా పొసగలేదు. సో ఆమెను పూర్తిగా పక్కన పెట్టింది బీజేపీ. సో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎవరు మహిళలు సీఎంగా లేరు. మహిళా సాధికారితలో భాగంగా రేఖా గుప్తాను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఈమె 1974 జూలై 19న హరియాణలో జన్మించింది.
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
ఉమెన్ లీడర్స్ రాష్ట్రాల్లో అంత బలమైన లీడర్స్ లేరు. కొన్ని రాష్ట్రాల్లోనే ఇప్పుడు తమిళ సై సౌందర్యరాజన్ మన తమిళనాడు అధ్యక్షురాలుగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా పురందేశ్వరి ఉన్నారు కానీ..ఇక్కడ బీజేపీ అధికారంలోకి రావడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా ఓ మహిళా నేతను ఎంపిక చేయడం వెనక బీజేపీ పెద్దల స్ట్రాటజీ ఉంది. ఒక రకంగా రేఖా వర్మ ఎంపిక చేయడంతో పర్వేష్ వర్మ కొంచెం డిసప్పాయింట్ అయ్యారని చెప్పొచ్చు. ఈయనే సీఎం పదవి ఇస్తారని అందరు అనుకున్నారు. కానీ ముఖ్యంగా మహిళా నేత..మరోవైపు క్యాస్ట్ ఈక్వేషన్స్.. రేఖా గుప్తాకు కలిసొచ్చాయనే చెప్పాలి.
గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రి పనిచేసిన వాళ్లు ఎవరు ఢిల్లీలో పుట్టలేదు. అప్పట్లో బీజేపీ తొలి మహిళా సీఎం సుష్మా స్వరాజ్.. హర్యానాలో జన్మించారు. అరవింద్ కేజరివాల్ హర్యానాలోనే పుట్టారు. ఇపుడు రేఖా గుప్తా కూడా హర్యానాలో పుట్టిన వ్యక్తి కావడం గమనార్హం.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.