PPF Updates: పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ అనేది దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ పథకం. ఈ పధకంలో జీరో రిస్క్ ఉంటుంది అధిక ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఉన్న పధకమిది. ఈ పధకంలో వచ్చే ఆదాయంపై జీరో ట్యాక్స్ ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పధకం ఇది. ఇన్‌కంటాక్స్ సెక్షన్ 80సి ప్రకారం ఏడాదికి 1.50 లక్షల వరకూ పన్ను మినహాయింపు ఉంటుంది. బ్యాంక్ లేదా పోస్టాఫీసు ద్వారా ఈ పధకంలో చేరవచ్చు. ఈ పథకంలో ఏడాదికి కనీసం 500 రూపాయల నుంచి గరిష్టంగా 1.50 లక్షల వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ పధకం మెచ్యూరిటీ 15 ఏళ్లు ఉంటుంది. ఆ తరువాత ఐదేళ్లకు పొడిగించవచ్చు. ఆ ఐదేళ్ల తరువాత మరో ఐదేళ్లు పొడిగించవచ్చు. ఏడాదికి 1.50 లక్షల వరకూ ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. వడ్డీపై కూడా మినహాయింపు ఉంటుంది. అంతేకాకుండా మెచ్యూరిటీ కంటే ముందే అత్యవసరమైతే పాక్షికంగా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.
ఈ పధకంలో చేరిన 4వ ఏడాది నుంచి బ్యాలెన్స్‌లో 50 శాతం వరకు విత్ డ్రా చేయవచ్చు. మెచ్యురిటీ తరువాత ఎంతకాలం కావాలంటే అంతకాలం ఐదేళ్ల చొప్పున పొడిగించవచ్చు. 15 ఏళ్ల వరకు ఏడాదికి 1.50 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఆ తరువాత నెలకు 39 వేల రూపాయలు ఆదాయం తీసుకోవచ్చు. ఏడాదికి 1.50 లక్షలు 15 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే మొత్తం పెట్టుబడి 22 లక్షల 50 వేలు ఉంటుంది. వడ్డీ 18 లక్షల 18 వేల 209 రూపాయలు ఉంటుంది. మరో ఐదేళ్లు పొడిగిస్తే 20 ఏళ్లకు 30 లక్షలు పెట్టుబడి జమ అవుతుంది. వడ్డీ 36 లక్షల 58 వేల 28 రూపాయలు ఉంటుంది. మొత్తం నిధి 66 లక్షల 58 వేల 288 రూపాయలు అవుతుంది.
ఈ మొత్తంపై 7.10 శాతం వడ్డీతో 20 ఏళ్లకు 5,54,857 రూపాయలు అవుతుంది. అంటే నెలకు వడ్డీ రూపంలో వట్టే ఆదాయం 39,394 రూపాయలు అవుతుంది. ఈ ఆదాయంపై ట్యాక్స్ ఉండదు. పీపీఎఫ్ పధకంలో ఇన్వెస్ట్‌మెంట్‌తో ఆర్ధికంగా సెక్యూరిటీ, ట్యాక్స్ రహిత ఆదాయం ఉంటుంది.
Also read: Delhi Elections 2025: ఢిల్లీ ఓటర్లు ఎంత మంది, ఏ వర్గాల ఓట్లు, ఏయే అంశాలు కీలకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి