How to Apply Pan 2.0: పాన్ కార్డు అనేది వ్యక్తి ఆర్ధిక లావాదేవీల సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుంటుంది. అందుకే ఏ ఆర్ధిక లావాదేవీ చేయాల్సి వచ్చినా పాన్ కార్డు వివరాలు తప్పనిసరి చేసింది కేంద్ర ఆర్ధిక శాఖ. అదే సమయంలో వ్యక్తి ఆర్ధిక లావాదేవీలు, వివరాలకు మరింత రక్షణ కల్పించేందుకు కొత్తగా పాన్ 2.0 ప్రాజెక్టు ప్రారంభించింది. మరి మీరు కూడా కొత్త పాన్ కార్డ్ తీసుకున్నారా లేదా..ఎలా తీసుకోవాలో ఆ వివరాలు మీ కోసం.
ఇప్పటి వరకు ఉన్న పాన్ కార్డు వేరు. ఇప్పుడు కొత్తగా వస్తున్న పాన్ కార్డు వేరు. కొత్తగా వస్తున్న పాన్ కార్డుల్లో క్యూ ఆర్ కోడ్ ఉంటుంది. వ్యక్తుల వివరాల భద్రత, రక్షణ ఇందులో పూర్తిగా ఉంటుంది. ట్యాక్స్ పేయర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ కొత్త కార్డు మరింత సులభతరం చేస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే ఇన్‌కంటాక్స్ ప్రవేశపెట్టిన ఇ గవర్నెన్స్ ఇనీషియేటివ్ ఇది. ఇప్పటి వరకూ వేర్వేరుగా ఉన్న పాన్ నెంబర్, ట్యాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ ఎక్కౌంట్ నెంబర్ అంటే ట్యాన్ నెంబర్లను ఒకే డిజిటల్ వేదికగా ఉంటాయి. పాన్ 2.0లో ఉండే క్యూఆర్ కోడ్ అనేది ఆ వ్యక్తి గుర్తింపును మరింత వేగంగా ప్రామాణీకరిస్తుంది. ఏకీకృత డిజిటల్ పోర్టల్ కారణగా పాన్, టాన్ సేవలు ఒకే వ్యవస్థ పరిధిలో ఉంటాయి. పాన్ కార్డు డేటా మరింత సురక్షితంగా ఉంటుంది.
కొత్త పాన్ కార్డు లేదా పాన్ 2.0 అందరూ తీసుకోవచ్చు. ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే కార్డు ఉన్నవాళ్లు క్యూఆర్ వెర్షన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి. దీనికోసం నిర్ధారిత ఐడీ కార్డు, అడ్రస్ ప్రూఫ్ అవసరం. పాన్ 2.0 అనేది పూర్తిగా ఉచితంగా అందుతుంది. గుర్తింపు కోసం ఆధార్ కార్డు, పాస్ పోర్ట్, ఓటర్ ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు. ఇక అడ్రస్ ప్రూఫ్ కోసం బ్యాంక్ స్టేట్మెంట్, యుటిలిటీ బిల్లు, రెంటల్ అగ్రిమెంట్ కావాలి. పుట్టిన తేదీ ప్రూఫ్ కోసం పదో తరగతి సర్టిఫికేట్, పాస్‌పోర్ట్ లేదా బర్త్ సర్టిఫికేట్ అవసరమౌతాయి.
పాన్ 2.0 ఎలా తీసుకోవాలి
ముందుగా ఎన్ఎస్డీఎల్ అధికారిక పోర్టల్ ఓపెన్ చేయాలి. ఆ తరువాత పాన్ రిక్వెస్ట్ పేజ్‌లో ఎంటర్ అవాలి. మీ పాన్ కార్డు వ్యక్తిగత సమాచారం ఎంటర్ చేసి ఐడీ, అడ్రస్, బర్త్ ప్రూఫ్ కాపీలు సమర్పించాలి. ఓటీపీ డెలివరీ పద్ధతితో ధృవీకరించాలి. చివరిగా అన్ని వివరాలు సరిచేసుకుని సబ్మిట్ చేస్తే చాలు..మీ కొత్త కార్డు వారం పది రోజుల్లో ఇంటికి వస్తుంది.
Also read: Oyo Dispute: మళ్లీ వివాదంలో ఓయో, బూమరాంగ్ అవుతున్న సంస్థ ప్రకటన, అసలేం జరిగింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి