LIC Pension Scheme: ఎల్ఐసీ నుంచి కొత్తగా పెన్షన్ ఆధారిత స్కీమ్ ప్రారంభమైంది. అదే స్మార్ట్ పెన్షన్ ప్లాన్. ఇది సింగిల్ ప్రీమియం వార్ధిక ప్లాన్. ఈ ప్లాన్ తీసుకుంటే జీవితాంతం పెన్షన్ పొందవచ్చు. ఈ ప్లాన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎవరెవరు ఈ ప్లాన్ తీసుకోవచ్చు. పూర్తి ప్రయోజనాలేంటనేది చూద్దాం.
స్మార్ట్ పెన్షన్ ప్లాన్ అనేది ఎల్ఐసీ ఇటీవల లాంచ్ చేసిన పాలసీ. సింగిల్ ప్రీమియం ద్వారా ఏడాది వ్యాలిడిటీతో ఈ స్కీమ్ ప్రారంభించవచ్చు. మీ అవసరాలకు తగ్గట్టుగా వివిధ రకాల యాన్యుటీ ఆప్షన్లు ఉన్నాయి. ఈ పాలసీ తీసుకునేందుకు కనీస వయస్సు 18 ఏళ్లు కాగా గరిష్టంగా 100 ఏళ్లు ఉండవచ్చు. ఇందులో సింగిల్ లైఫ్ అంటే ఇండివిడ్యువల్ కోసం తీసుకోవచ్చు. లేదా జాయింట్ లైఫ్ యాన్యుటీ కూడా ఉంది. పాత పాలసీదారులకు, నామినీలకు అదనపు యాన్యుటీ రేట్ లభిస్తుంది. అవసరమైనప్పుడు పాక్షికంగా లేదా మొత్తం విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌పై ఆసక్తి ఉంటే స్థానికంగా ఉండే ఎల్ఐసీ కార్యాలయం లేదా ఎల్ఐసీ అధీకృత ఏజెంట్ లేదా ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్ www.licindia.in ద్వారా పొందవచ్చు.
పదవీ విరమణ తరువాత కూడా నిర్దిష్ట ఆదాయం కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎల్ఐసీ అందిస్తున్న స్మార్ట్ పెన్షన్ స్కీమ్‌తో జీవితకాలం నిర్దేశిత పెన్షన్ లభిస్తుంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇది చాలా లాభదాయకమైన పాలసీ అని చెప్పవచ్చు.
ఈ పాలసీ తీసుకోవాలంటే కనీసం 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి. మీ ఇన్వెస్ట్ మెంట్ పెరిగే కొద్దీ అధిక లాభాలు ఉంటాయి. ఎన్పీఎస్ ఖాతాదారులకు అదనపు యాన్యుటీ సౌకర్యం ఉంటుంది. ఇందులో నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది ఆప్షన్లు ఉన్నాయి. ఈ పాలసీ ప్రారంభించిన 3 నెలల తరువాత అవసరమైతే లోన్ తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకుంటే మొత్తం ఒకేసారి లేదా వాయిదాల్లో మీ ప్రీమియం చెల్లించవచ్చు.
Also read: Bank Holidays 2025: మార్చ్ నెలలో 12 రోజులు మూతపడనున్న బ్యాంకులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి