Hydrogen Train: ఇండియన్ హైడ్రోజన్ రైలు గురించి మీరు నమ్మలేని నిజాలు

Hydrogen Train: సాంకేతికంగా భారతీయ రైల్వే కొత్త పుంతలు తొక్కుతోంది. ఆధునిక శాస్త్ర పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు దేశంలో తొలిసారిగా హైడ్రోజన్ ట్రైన్ దేశీయంగా అభివృద్ధి చేస్తోంది. ఈ రైలు ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 9, 2025, 05:22 PM IST
Hydrogen Train: ఇండియన్ హైడ్రోజన్ రైలు గురించి మీరు నమ్మలేని నిజాలు

Hydrogen Train: వందేభారత్, బుల్లెట్ ట్రైన్ల నుంచి ఇండియన్ రైల్వేస్ ఇప్పుడు హైడ్రోజన్ రైళ్లపై దృష్టి సారించింది. దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలును తయారు చేస్తున్న భారతీయ రైల్వే ఆ రైలు ప్రత్యేకతల్ని వివరించింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ హైడ్రోజన్ రైలు ప్రత్యేకతలు, ఫీచర్ల గురించి వివరించారు. 

భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలు రూపు దిద్దుకుంటోంది. ప్రపంచంలోని అన్ని హైడ్రోజన్ రైళ్ల కంటే ఇదే అత్యంత పొడవైనది, శక్తివంతమైనదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో వివరించారు. సామర్ధ్యం, పొడవులలోనే కాకుండా సాంకేతికంగా కూడా ఈ రైలు చాలా శక్తివంతమైంది, ప్రత్యేకమైంది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో ఈ రైలు అభివృద్ధి జరుగుతోంది. డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రేక్స్పై  హైడ్రోజన్ సెల్స్ రిట్రోఫిట్మెంట్ ద్వారా రూపు దిద్దుకుంటోంది. ఇండియన్ రైల్వేస్‌కు చెందిన రైల్వే రీసెర్చ్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ రైలు ఫీచర్లను రూపొందించింది. రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా హైడ్రోజన్ రైలు వివరాలను రైల్వే మంత్రి వెల్లడించారు. 

దేశంలో రూపు దిద్దుకుంటున్న హైడ్రోజన్ రైలుతో పాటు హైడ్రోజన్ రీఫిల్ కోసం ఇంటిగ్రేటెడ్ హైడ్రోజన్ ప్రొడక్షన్ స్టోరేజ్ డిస్ట్రిబ్యూషన్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భద్రతా ప్రమాణాలు, అనుమతి కోసం పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ను కోరామన్నారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు ఉపయోగించడం ద్వారా క్లీన్ అండ్ గ్రీన్ ఫ్యూచర్ దిశగా భారతీయ రైల్వే అడుగులు వేస్తోందని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకూ ప్రపంచంలో కేవలం నాలుక దేశాలే హైడ్రోజన్ రైలు రూపొందించాయన్నారు. జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, చైనా తరువాత ఇండియా కావచ్చన్నారు. 

హైడ్రోజన్ రైలు తయారీ విషయంలో ప్రపంచంలో ఐదవ దేశమైనా...ఈ రైలు ప్రత్యేకతల విషయంలో మాత్రం మిగిలిన నాలుగు దేశాల్ని భారతీయ రైల్వే అధిగమిస్తుంది. ఎందుకంటే పొడవ, సామర్ధ్యం విషయంలో మిగిలిన రైళ్ల కంటే చాలా చాలా శక్తివంతమైంది. మిగిలిన హైడ్రోజన్ రైళ్లు 500-600 హార్స్ పవర్ ఎనర్జీ ఉత్పత్తి చేయగలవు. కానీ భారతీయ రైల్వే రూపొందిస్తున్న హైడ్రోజన్ రైలు 120 హార్స్ పవర్ ఎనర్జీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. 

Also read: Ys Jagan Strategy: షర్మిలకు జగన్ షాక్, త్వరలో పార్టీలో మరో ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నేతలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News