Fastag Recharge: దేశవ్యాప్తంగా టోల్ గేట్ చెల్లింపుల కోసం అమల్లో ఉన్న ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానమే ఫాస్టాగ్. మీ వాహనం నెంబర్‌కు లింక్ అయుండే ఎలక్ట్రానిక్ వ్యాలెట్. ఈ వ్యాలెట్‌లో డబ్బులతో టోల్ వసూలు అవుతుంటుంది. ఈ వ్యాలెట్ అంటే ఫాస్టాగ్ ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ రీఛార్జ్ చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఆ వివరాలు చూద్దాం.
ఫాస్టాగ్ విధానం అమల్లోకి వచ్చాక టోల్ గేట్ల వద్ద క్యూ లైన్లు తగ్గాయి. నగదు రహిత లావాదేవీలు కావడంతో క్యూ లైన్ నిరీక్షణ తప్పింది. టోల్ గేట్ వద్ద ఉండే స్కానర్లు మీ కారు ముందు భాగంలో అంటించి ఉండే ఫాస్టాగ్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆ వ్యాలెట్ నుంచి టోల్ వసూలు చేస్తుంది. అయితే ఫాస్టాగ్ బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. బ్యాలెన్స్ అయిపోతే వెంటనే క్షణాల్లో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఫాస్టాగ్ రీఛార్జ్ కోసం చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
ఫాస్టాగ్ రీఛార్జ్ ఆప్షన్లలో అత్యంత తేలికైంది, సులభమైంది యూపీఐ ద్వారా రీఛార్జ్ చేయడం. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి అందుబాటులో ఉన్న ప్రతి యూపీఐతో పాటు వివిధ బ్యాంకుల యూపీఐతో కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఏదో ఒక యూపీఐ ఓపెన్ చేసి అందులో ఫాస్టాగ్ రీఛార్జ్ సెక్షన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు అందులో మీ ఫాస్టాగ్ ఎక్కౌంట్ నెంబర్ ఎంటర్ చేసి ఎంత బ్యాలెన్స్ రీఛార్జ్ చేయించాలనుకుంటున్నారో అంత ఎంటర్ చేసి పిన్ నొక్కితే చాలు..మీ బ్యాంక్ ఎక్కౌంట్ నుంచి ఫాస్టాగ్ రీఛార్జ్ పూర్తవుతుంది.
యూపీఐ కాకుండా ఫాస్టాగ్ అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఫాస్టాగ్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి మీ వాహనం నెంబర్ ఎంటర్ చేసి, ఆ తరువాత రిజిస్టర్ మొబైల్ నెంబర్ ప్రెస్ చేయాలి. కావల్సిన ఎమౌంట్ ఎంటర్ చేసి చెల్లింపు పూర్తి చేస్తే చాలు. మీ ఫాస్టాగ్ రీఛార్జ్ అయిపోతుంది. లేదా నేరుగా టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ సెంటర్లు అందుబాటులో ఉంటాయి. అక్కడికి వెళ్లి డబ్బులిచ్చి ఫాస్టాగ్ రీఛార్జ్ చేయవచ్చు.
యూపీఐ కాకుండా బ్యాంకులు కూడా ఫాస్టాగ్ సేవలు అందిస్తున్నాయి. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉండే బ్యాంకు యాప్ లేదా వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఫాస్టాగ్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఆ తరువాత మీ వాహనం నెంబర్ లేదా ఫాస్టాగ్ ఎక్కౌంట్ నెంబర్ ఎంటర్ చేసి రీఛార్జ్ చేయవచ్చు.
Also read: Thandel Real Hero: తండేల్ కధ రియల్ హీరో వైఎస్ జగన్, అసలు సినిమాకు జగన్‌కు ఉన్న సంబంధమేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి