8th Pay Commission Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, పెన్షనర్లకు డీఆర్ అనేది ఏడాదిలో రెండు సార్లు పెరుగుతుంటుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 53 శాతం అందుతోంది. ఈ ఏడాది ఆఖరుకు అది 60 శాతానికి చేరవచ్చు. అయితే డీఏ కనీస వేతనంలో విలీనమైతే ఉద్యోగులకు మరింత ప్రయోజనం కలుగుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ కేంద్ర ప్రభుత్వం ఏడాదిలో రెండు సార్లు పెంచుతుంటుంది. ప్రస్తుతం 53 శాతంగా ఉన్న డీఏ త్వరలో అంటే మార్చ్ నెలలో 56 శాతానికి పెరగవచ్చు. ఆ తరువాత జూలై డీఏ పెంపుతో కలుపుకుంటే ఈ ఏడాది చివర్లో 60 శాతం కావచ్చు. వాస్తవానికి కొన్ని ప్రతిపాదనల ప్రకారం డీఏ 50 శాతం దాటితే కనీస వేతనానికి కలిపి తిరిగి సున్నా నుంచి డీఏ లెక్కించాలి. అయితే గత ఏడాది జూలైలో డీఏ పెంపుతో 50 శాతం దాటినా అమల్లోకి రాలేదు. దాంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో సందిగ్ధత నెలకొంది. డీఏ కనీస వేతనంలో ఎప్పుడు విలీనం చేస్తారా అని చూస్తున్నారు. ఎందుకంటే 53 శాతం ఉన్న డీఏను కనీస వేతనంలో విలీనం చేస్తే భారీగా జీతం పెరుగుతుంది. ఏ ఉద్యోగి అయినా కనీస వేతనం ఎక్కువగా ఉంటే ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. ఎందుకంటే హెచ్ఆర్ఏ, డీఏ వంటి చాలా ప్రయోజనాలను కనీస వేతనం ఆధారంగానే లెక్కిస్తుంటారు.
అయితే ఇప్పుడు అందుతున్న తాజా అప్‌డేట్ ప్రకారం కొత్త వేతన సంఘం అమల్లోకి వచ్చినప్పుడు డీఏ విలీనం ఉంటుందని తెలుస్తోంది. అంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చినప్పుడు అప్పటి వరకు ఉన్న డీఏను కనీస వేతనంలో కలిపి సున్నా నుంచి లెక్కిస్తారు. అంటే వచ్చే ఏడాది నుంచి డీఎ విలీనం ఉండవచ్చు. అప్పటికి డీఏ 60 శాతానికి చేరుతుంది. అంటే వచ్చే ఏడాది ప్రారంభంలో 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చినప్పుడు ఉద్యోగుల కనీస వేతనం 60 శాతం లేదా 50 శాతం పెరగవచ్చు. ఒకవేళ 50 శాతమే విలీనమైతే మిగిలిన 10 శాతం నుంచి డీఏ లెక్కింపు ఉంటుంది. ఈ లెక్కన 18 వేలు కనీస వేతనం ఉంటే డీఏ 9 వేలు విలీనమైతే 27 వేలకు పెరుగుతుంది. ఆ తరువాత 8వ వేతన సంఘం ప్రకారం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ని బట్టి కనీస వేతనం మరింతగా పెరుగుతుంది.
Also read: Holidays: ఆ రెండ్రోజులు ఏపీ, తెలంగాణలో సెలవు, ఎవరెవరికి, ఎప్పుడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి