Bank Of Baroda: బ్యాంక్‌ ఆఫ్ బరోడా బంపర్‌ ఆఫర్.. 518 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. ప్రారంభంలోనే లక్ష జీతం..

Bank Of Baroda Notification 2025: బ్యాంకు జాబ్ చేయాలని చాలా మంది కల కంటారు. ఈనేపథ్యంలో సాధించడానికి విశ్వప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అలాంటి వారికి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తీపి కబురు అందించింది. 518 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Written by - Renuka Godugu | Last Updated : Feb 21, 2025, 10:51 AM IST
Bank Of Baroda: బ్యాంక్‌ ఆఫ్ బరోడా బంపర్‌ ఆఫర్.. 518 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. ప్రారంభంలోనే లక్ష జీతం..

Bank Of Baroda Notification 2025: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. బ్యాంక్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. తద్వారా 518 పోస్టులు భర్తీ చేయనుంది. ఇందులో మేనేజిరియల్‌ ఇతర పొజిషన్ల భర్తీ చేయనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు bankofbaroda.in అధకారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగానే నోటిఫికేషన్‌ కూడా క్షుణ్నంగా పరిశీలించి ఆ తర్వాత దరఖాస్తు చేసుకోవాలి.

2025 ఫిబ్రవరి 19 నుంచి దరఖాస్తు స్వీకరణ ప్రారంభం అయింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి ముందుగా ఆన్‌లైన్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇది కాకుండా సైకోమెట్రిక్‌ ద్వారా పోస్టులకు ఫైనల్‌ చేస్తారు. ఆన్‌లైన్‌ టెస్ట్‌ పాసైన వారికి గ్రూప్‌ డిస్కషన్‌ ఆ తర్వాత పర్సనల్‌ ఇంటర్వ్యూకు పిలుస్తారు. 

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 150 మార్కులతో కూడిన క్వశ్చన్స్‌ ఉంటాయి. ఇందులో 225 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షను 150 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. పరీక్ష పేపర్‌ హిందీ, ఇంగ్లిషులో అందుబాటులో ఉంటుంది. 

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఖాళీ వివరాలు..
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 518 పోస్టులు భర్తీ చేయనుంది. ఇన్‌ఫర్మేషన్‌ మేనేజర్‌ 350, ట్రేడ్‌ ఫారెక్స్‌-97, సెక్యూరిటీ 36, రిస్క్‌ మేనేజ్మెంట్‌ 35 భర్తీ చేయనున్నారు.

ఇదీ చదవండి:   పీఎం కిసాన్‌ కొత్త రైతుల రిజిస్ట్రేషన్‌ ఎలా? స్టెప్‌ బై స్టెప్‌ విధానం ఇదే..  

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రిక్రూట్మెంట్‌ 2025 దరఖాస్తు చేసుకునే విధానం..
bankofbaroda.in అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.  దీనికి కెరీర్‌ ఆప్షన్‌ ఎంపిక చేసుకుని అందులో రిక్రూట్మెంట్‌  ఎంపిక చేసుకుని అక్కడ లాగిన్‌ అయి మీ పూర్తి వివరాలు నమోదు చేయాలి. కావాల్సిన ధృవపత్రాలను కూడా అప్‌లోడ్ చేయాలి. ఫోటోగ్రాఫ్‌, సిగ్నేచర్‌ కూడా సబ్మిట్‌ చేయాలి. చివరగా రివ్యూ చేసుకోవాలి.  

ఆ తర్వాత డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డు లేదా ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా చెల్లించాలి. ఆ తర్వాత కాపీని ప్రింట్‌ తీసి పెట్టుకోవాలి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నోటిఫికేషన్‌ పీడీఎఫ్‌ కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

ఇక ఈ స్పెషలిస్ట్‌ ఆఫీసర్లకు అర్హత బీఈ లేదా బీటెక్‌ పూర్తి చేసి ఉండాలి. ఇతర మేనేజర్‌ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ పొంది ఉండాలి. వయోపరిమితి పొజిషన్‌ ఆధారంగా ఉంటాయి.

ఇదీ చదవండి: జియో 336 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌తో అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ మాత్రమే కాదు.. మరిన్ని బెనిఫిట్స్‌..  

అప్లికేషన్‌ ఫీజు జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అప్లికేషన్‌ చివరి తేదీ మార్చి 11. 

ఈ పరీక్షలో రీజనింగ్‌ 25 ప్రశ్నలు, క్వాంటిటేటీవ్‌ ఆప్టిట్యూడ్‌ 25 ప్రశ్నలు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 25 ప్రశ్నలు, ప్రొఫెషన్‌ నాలెడ్జీ 75 ప్రశ్నలు, మొత్తంగా  150 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 150 నిమిషాలు పరీక్ష సమయం ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి గ్రేడ్‌ IV ఆఫీసర్లకు 1,02,300 వరకు జీతం ప్రారంభంలోనే అందుకుంటారు. ఆ తర్వాత ఇంక్రిమెంట్లు ఉంటాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News