8th Pay Commission Salary Hike in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజుల్నించి ఎదురు చూస్తున్న 8 వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగులు జీతభత్యాలు, పెన్షనర్ల పెన్షన్ గణనీయంగా పెరగనుంది. ఈ క్రమంలో జీతాలు ఎంతవరకు పెరగనున్నాయో పరిశీలిద్దాం.
8వ వేతన సంఘం అమల్లోకి వస్తే గతంలో ఉన్నట్టే ఎక్రాయిడ్ ఫార్ములా ప్రకారం ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. కొత్త వేతన సంఘంతో కోటికి పైగా ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. దీనికోసం ఓ ఫార్ములా కూడా ఉంది. 7వ వేతన సంఘం అమలైనప్పుడు ఉద్యోగుల జీతభత్యాలు పెంచేందుకు వినియోగించిన ఎక్రాయిడ్ ఫార్ములానే ఇప్పుడు కూడా ఉపయోగపడనుంది. ఈ ఫార్ములాను డాక్టర్ వాలేస్ ఎక్రాయిడ్ రూపొందించడంతో ఆ పేరు వచ్చింది. జీతాలనేవి ఉద్యోగి పోషక అవసరాలకు అనుగుణంగా నిర్ణయించాల్సి ఉంటుంది. ఉద్యోగి కనీస అవసరాలైన ఆహారం, బట్టలు, నివాసం ఏర్పర్చుకునే దిశగా జీతాల రూపకల్పన ఉండాలని ఈ ఫార్ములా చెబుతోంది. 1957లో 15వ కార్మిక మహాసభ ఈ ఫార్ములాను ప్రవేశపెట్టింది.
ఈ ఫార్ములా ప్రకారమే 7వ వేతన సంఘం అమల్లోకి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కనీస వేతనం 7 వేల రూపాయల నుంచి 18 వేలకు చేరుకుంది. దాదాపు పదేళ్ల క్రితం 7వ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57కు పెరిగింది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, పెన్షన్ పెరిగాయి. ఈ వేతన విధానం ఎక్రాయిడ్ ఫార్ములా ఆధారంగా రూపొందించారు.
8వ వేతన సంఘంతో జీతాలు ఎంత పెరుగుతాయి
ఈసారి కూడా 8వ వేతన సంఘంలో ఇదే ఎక్రాయిడ్ ఫార్ములాను వినియోగించనున్నారు. ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయమౌతుంది. ఈసారి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.92 నుంచి 2.86 మద్య ఉండవచ్చని అంచనా ఉంది. గరిష్టంగా 2.86 తీసుకుంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం 51,480 రూపాయలకు పెరగనుంది. ప్రస్తుతం కనీస వేతనం కేవలం 18 వేలు ఉంది. ఇక పెన్షన్ అయితే 9 వేల నుంచి 25,740 రూపాయలు ఉంటుంది.
ప్రస్తుతం ఉన్న కనీస వేతనం లేదా పెన్షన్‌ను ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌తో గుణించడం ద్వారా కొత్త వేతనం ఎంతనేది ఉంటుంది. అందుకే 8వ వేతన సంఘం ఎప్పుడెప్పుడు అమల్లోకి వస్తుందా అని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.
Also read: Delhi Election Offer: ఎన్నికల్లో ఓటేస్తే చాలు...ఇక్కడ 50 శాతం డిస్కౌంట్, ఆఫర్ మరో రెండ్రోజులే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి