8th Pay Commission Date: కేంద్ర ప్రభుత్వం ఇటీవల 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపిన తరువాత అది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయంపై ఉద్యోగుల్లో చాలా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే జీతభత్యాలు భారీగా పెరగనున్నాయి. ఈ క్రమంలో 8వ వేతన సంఘం అమలు తేదీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈ ఏడాది జనవరి 17న కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కమిటీ కచ్చితంగా ఎప్పుడు ఏర్పడుతుందనేది ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. కమిటీ ఏర్పడిన తరువాత ఈ ప్రక్రియ దాదాపుగా 7-8 నెలలు ఉంటుంది. కమిటీ పూర్తిగా అన్ని వివరాలు అధ్యయనం చేసి సిఫార్సులతో నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఆ తరువాత కేంద్ర కేబినెట్ ఆమోదించాల్సి ఉంటుంది. అప్పుడే ఇది అమల్లోకి వస్తుంది. గతంలో వేతన సంఘాలకు వేర్వేరు సమయం పట్టింది. 5వ వేతన సంఘం 1994 ఏప్రిల్‌లో ప్రకటించగా జూన్ నెలలో కమిటీ ఏర్పడింది. అంటే రెండు నెలల సమయం పట్టింది. ఇక 6వ వేతన సంఘం 2006 జూలైలో ప్రకటించగా అక్టోబర్‌లో కమిటీ ఏర్పాటైంది. మూడు నెలల సమయం పట్టింది. ఇక 7వ వేతన సంఘాన్ని 2013 సెప్టెంబర్ నెలలో ప్రకటించగా 5 నెలల తరువాత 2014 ఫిబ్రవరిలో కమిటీ ఏర్పడింది. అంటే ఇప్పుడు కూడా 8వ వేతన సంఘం కమిటీ మార్చ్ -జూలై మధ్చలో ఏర్పడవచ్చు. 8వ వేతన సంఘం మాత్రం 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది ఇందులో చాలా కీలకం. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను బట్టి జీతం ఎంత పెరుగుతుందనేది ఉంటుంది. 7 వేతన సంఘం అమలైనప్పుడు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 కావడంతో లెవెల్ 1 ఉద్యోగులకు కనీస వేతనం 7 వేల రూపాయల నుంచి 18 వేలకు పెరిగింది. డీఏ, హెచ్ఆర్ఏ కలుపుకుంటే అది కాస్తా 36 వేలు అయింది. ఇప్పుడు 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 అవుతుందని అంచనా ఉంది. అదే నిజమైతే లెవెల్ 1 ఉద్యోగులకు జీతం 18 వేల రూపాయల నుంచి 51,480 రూపాయలకు పెరుగుతుంది. కొత్త వేతన సంఘం అనేది సాధారణంగా ప్రతి పదేళ్లకోసారి ఏర్పడుతుంటుంది. ఉద్యోగుల జీతభత్యాలు, వేతన విధానం, పెన్షన్, అలవెన్సులు నిర్ణయించేందుకు ఈ కొత్త వేతన సంఘం ఉపయోగపడుతుంది. ఆర్ధిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం ఇతర కారణాలు ప్రభావితం చేస్తాయి.
Also read: Sankranthiki Vasthunnam: సంక్రాంతికి వస్తున్నాం తేదీ వచ్చేసింది, ఓటీటీ కంటే ముందే ఆ టీవీ ఛానెల్‌లో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి